»   » అవి సూపర్ హిట్లే కానీ..! స్క్రిప్ట్ లేదు: వర్మ ఆన్సర్ కి షాక్ తిన్న అనుపమ

అవి సూపర్ హిట్లే కానీ..! స్క్రిప్ట్ లేదు: వర్మ ఆన్సర్ కి షాక్ తిన్న అనుపమ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంచలన వ్యాఖ్యలు చేయటం తప్ప దర్శకుదు రామ్‌గోపాల్ వర్మకి వేరే పని లేకుండా పోయింది. ట్విట్టర్ వదిలినా ఆయన పంచ్ స్వభావం మాత్రం మారలేదు. ప్రముఖ బాలీవుడ్ జర్నలిస్ట్ అనుపమా చోప్రా కు షాకింగ్ సమాధానం ఇచ్చాడు. నిర్మాత విధూ వినోద్ చోప్రా భార్య అయిన అనుపమా.. ' అనుపమా ఫిల్మ్ కంపానియన్' పేరుతో ఓ వెబ్ సైట్ ను నడుపుతోంది. ఇటీవల ఈమె వర్మను సాయం కోరింది.

Ram Gopal Varma Reply to Anupama Chopra

వర్మ తెరకెక్కించిన క్లాసిక్స్ సత్య, కంపెనీ సినిమాల స్క్రిప్ట్ లు ఇస్తే తన వెబ్ సైట్ లో పెడతానని అవి సినీ రంగంలోకి రావాలనుకుంటున్నవారికి ఉపయోగకరంగా ఉంటాయని అడిగింది. అయితే అనుపమ అభ్యర్థన పై వర్మ తనదైన స్టైల్ లో స్పందించాడు. ఆ రెండు సినిమాలు తాను స్క్రిప్ట్ లేకుండానే తెరకెక్కించాను తెలుసా అంటూ షాక్ ఇచ్చాడు, ఎప్పటి నుంచైతే తాను బౌండెడ్ స్క్రిప్ట్ తో సినిమాలు చేయటం మొదలు పెట్టానో అప్పుడే తనకు ఫ్లాప్ లు మొదలయ్యాయని చెప్పాడు.

Ram Gopal Varma Reply to Anupama Chopra

అంతేకాదు విషయాన్ని వర్మ తన తల్లి మీద తనకు నచ్చిన దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ మీద ఒట్టేసి చెబుతానన్నాడు. వర్మ ఆన్సర్ తో షాకైన అనుపమా ఇది వర్మ మార్కు క్లాసిక్ అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. అంటే అసలు స్క్రిప్ట్ లేకుండా చేసే సినిమాలు హిట్ అయ్యేటట్టయితే పాపం సర్కార్ 3 కూడా అలాగే చేసుండాల్సింది కదా కాస్త పనికూదా తగ్గేది.. అని అక్కడ ఎవరూ అనలేదు గానీ బయటమాత్రం ఇదే టాక్..

English summary
Director Ram Gopal Varma shoking Reply to Anupama Chopra
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X