»   » 'రక్త చరిత్ర' లో పెద్ద ఎన్టీఆర్ రోల్ ని రివిల్ చేసిన రామ్ గోపాల్ వర్మ

'రక్త చరిత్ర' లో పెద్ద ఎన్టీఆర్ రోల్ ని రివిల్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రంలో పెద్ద ఎన్టీఆర్ కి ఓ కీలకమైన పాత్ర ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర ఏమిటన్నది రామ్ గోపాల్ వర్మ స్వయంగా రివిల్ చేసారు. ఆయన చెప్పేదాని ప్రకారం..ఎన్టీఆర్ పాత్ర ..న్యూట్రల్(తటస్ధంగా)రోల్ ప్లే చేస్తుంది. అటు ఫ్యాక్షనిజంను ఎంకరేజ్ చెయ్యదు..అలాగే ఖండించదు. ఫ్యాక్షన్ రాజకీయాలు, గ్రూపుల పట్ల ఆయన వైఖరి తటస్ధంగా ఉండటాన్ని చూపెడుతున్నాం. పరిటాల రవి రాజకీయాల్లోకి ప్రవేశించిన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ వైఖరిని స్పష్టం చేస్తున్నాం అన్నారు. ఇక శతృఘ్నసింహా..ఎన్టీఆర్ పాత్రను చేస్తున్నారు. మొదట ఈ పాత్రకు మోహన్ బాబుని అనుకున్నారు కానీ ఎందుకునో అది జరగలేదు. ఇక పరిటాల రవిగా వివేక్ ఒబరాయ్, మద్దెల చెరువు సూరిగా తమిళ హీరో సూర్య, అతని భార్య భానుమతి గా ప్రియమణి చేస్తున్నారు. ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu