twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ సినిమాకు తొలిసారి క్లీన్ సర్టిఫికెట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘శివ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు చాలా సినిమాలు తీసాడు. అందులో ఒక్కటంటే ఒక్క సినిమాకు కూడా సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు' సర్టిఫికెట్ ఇవ్వలేదు. తొలిసారిగా వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘365 డేస్' అనే సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ ఇవ్వడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. నందు, అనైక సోఠి జంటగానటించిన ఈ చిత్రాన్ని డి.వి.క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మించారు. సినిమాలో ఎలాంటి క్రైం సన్నివేశాలు లేకుండా చిత్రీకరించారు. మే 15న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    ఓ జంట ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమా స్ర్కీన్ ప్లే ని రూపొందించడం జరిగింది. ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు ఉండవు. 365 డేస్ చిత్రం నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో క్రైమ్ లేదు. మంచి ఎమోషన్స్ తో ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నారు.

    Ram Gopal Varma's first U certified film

    మ్యూజిక్ డైరెక్టర్ నాగ్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ...'నేను చాలామంది డైరెక్టర్స్ తో వర్క్ చేసాను. కానీ రాంగోపాల్ వర్మలాంటి దర్శకుడి సినిమాకి పాటలందించడం అంటే అంత ఈజీ కాదు. సంగీతంపై అతనికి మంచి అవగాహన ఉంది. ఆయనకు ఎలాంటి పాటలు కావాలో తెలుసు. ఈ సినిమాకి మంచి పాటలు కుదిరాయి అన్నారు.

    సినిమా చేసేప్పుడు రామూగారు ఓ విషయం చెప్పారు. పదేళ్ల తర్వాత నేను చేస్తున్న లవ్ స్టోరీ అని, ఇదే నా మొదటి సినిమాలా ఫీలవుతున్నానని చెప్పారు. మంచి ఎమోషన్స్ తో రామూగారు తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది'' అని ఈ చిత్ర హీరో నందు చెప్పుకొచ్చారు.

    English summary
    Telugu film director Ram Gopal Varma's first ever U certificate film in his two decades of industry career. His upcoming entertainer 365 Days featuring Nandu and Anaika Soti has passed censors with U certificate from the board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X