»   »  వర్మ శృంగార ‘కోరిక’..నిర్మాత కోసమేనా? (ఫోటోలు)

వర్మ శృంగార ‘కోరిక’..నిర్మాత కోసమేనా? (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'XES' పేరుతో హిందీలో శృంగార చిత్రం తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కెరీర్లో తొలిసారిగా శృంగార చిత్రం తీస్తున్నట్లు వర్మ వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి తెలుగులో 'కోరిక' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈచిత్రానికి తెలుగు నిర్మాత మరెవరో కాదు...తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ బేనర్లో ఈ చిత్రం రాబోతోంది.

రెండు రోజుల క్రితం విడుదలైన వర్మ 'ఐస్ క్రీమ్' చిత్రానికి కూడా తుమ్మలపల్లి రామ సత్యనారాయణే నిర్మాత. 'ఐస్ క్రీమ్' ప్లాప్ టాక్ రావడంతో నిర్మాత నష్టాలు తప్పవనే అంటున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఆర్థిక నష్టాల నుండి గట్టెక్కించేందుకే అతనికి తెలుగు 'కోరిక' చిత్రాన్ని వర్మ అప్పగించినట్లు తెలుస్తోంది.

'కోరిక'(XES) సినిమా గురించి వర్మ వెల్లడిస్తూ...ఇందులో మనిషి మెదడు ఒక స్థాయిలో ఆలోచిస్తున్నపుడు మనిషి ఒక్కో విధంగా శృంగార జీవితాన్ని అనుభవిస్తాడు. ఇలా ఆరుగు వ్యక్తులు ఆరు విధాలుగా ఆలోచిస్తూ చివరికి కథలో కలిసిపోవడమే ఈ చిత్రం అని ఆ ఆరు విధమైన శృంగార స్థితులు ఏమంటే అపరాధం, ద్రోహం, నిస్సహాయత, ఇబ్బంది, బాధ, తాదాత్మ్యం అని వర్మ అన్నారు. ఇప్పటివరకు తను తీసిన సినిమాలకు భిన్నంగా వుంటుంది ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రం ద్వారా తనని తాను మళ్ళి బాలీవుడ్‌లో వెతుకుతున్నాను అని చెప్పారు.

‘కోరిక' ఫస్ట్ లుక్ ఇదే...

‘కోరిక' ఫస్ట్ లుక్ ఇదే...


హిందీలో ‘XES' పేరుతో తెరకెక్కే చిత్రాన్ని తెలుగులో ‘కోరిక' పేరుతో విడుదల చేయన్నారు. దాని ఫస్ట్ లుక్ ఇదు...

XES ఫస్ట్ లుక్

XES ఫస్ట్ లుక్


హిందీ వెర్షన్ XES ఫస్ట్ లుక్ ఇదే. పూర్తి శృంగార ప్రధానంగా ఈచిత్రం రాబోతోంది.

కొత్తగా ట్రై చేస్తున్న వర్మ

కొత్తగా ట్రై చేస్తున్న వర్మ


శివతో కెరీర్ మొదలు పెట్టిన వర్మ ఇప్పటి వరకు అన్ని రకాల సినిమాలు తీసాడు. శృంగార చిత్రం మాత్రం తీయలేదు.

కొత్తగా, విభిన్నంగా...

కొత్తగా, విభిన్నంగా...

ఇప్పటి వరకు ఎన్నో శృంగార ప్రధానమైన సినిమాలు వచ్చాయి. కానీ వర్మ సినిమా అందుకు పూర్తి భిన్నంగా, కొత్తగా ఉంటుందట.

English summary
First Look Poster of the Rgv's Upcoming Exotic Film Korika and in Hindi Version Titled as XES and this was the new Genera in Ram gopal varma's Film . The Film Details was not Yet reviled and full shot in Hind .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu