»   »  పిచ్చెక్కించాడు నయీమ్ థీమ్ సాంగ్ ఇదే....! నిజంగా వర్మ దమ్ముని మెచ్చుకోవాల్సిందే

పిచ్చెక్కించాడు నయీమ్ థీమ్ సాంగ్ ఇదే....! నిజంగా వర్మ దమ్ముని మెచ్చుకోవాల్సిందే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొంతకాలంగా హిట్స్ లేకపోయినా ఆర్జీవీ కి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసే ఓ మాఫియా డాన్.. మావోయిస్టులపై విపరీతమైన వ్యతిరేకత ఉన్న ఓ మాజీ నక్సలైట్.. సరెండర్ అయిన మావోయిస్టులకు ఇతడంటే టెర్రర్.. ఉన్నత పోలీస్ అధికారులకు కోవర్టు.. ఓ గ్యాంగ్ స్టర్.. కోబ్రా గ్యాంగుల క్రియేటర్.. ప్రభుత్వమే పావుగా వాడుకున్న ఓ రౌడీ షీటర్.. ఇలా ఎన్నో రకాలుగా నయీమ్ గురించి కథలు వినిపిస్తాయి. ఒక వ్యక్తి లైఫ్ లో ఇన్ని వేరియేషన్స్ చాలా అరుదు. పైగా మాఫియాకి లింక్ అవడం చాలా మంది దర్శకులను ఆకర్షించే విషయమే. ఇలాంటి సినిమాలు తీయడంలో దిట్ట సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను ఈ సినిమా తీయ బోతున్నట్టు ప్రకటించేసాడు కూడా.

ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే న‌యీం సినిమా టైటిల్ లోగో త‌యారు చేయించ‌డంతో పాటు లేటెస్టుగా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. ఐతే ఈ సినిమా తీస్తాన‌న్నందుకు త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు వ‌ర్మ తాజాగా వెల్ల‌డించాడు. దీంతో పాటు న‌యీం గురించి స‌మాచారం తెలుసుకునే క్ర‌మంలో త‌న‌కు తెలిసిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా వ‌ర్మ ట్విట్ట‌ర్లో పంచుకున్నాడు. తనని బెదిరించిన వాళ్ళకి సమాధానం కూడా చెప్పాడు. ఈ నేపథ్యం లో వర్మ చెప్పిన మరికొన్ని నయీమ్ సినిమా వివరాలు మరి కొన్ని.

నయీం మీద సినిమా

నయీం మీద సినిమా

ఇటీవల నయీమ్ పోలీస్ ఎన్ కౌంటర్లో హతం కావడం మీడియాలో సంచలన అయిన సంగతి తెలిసిందే. కిరాతకంగా హత్యలు చేసే క్రిమినల్ గా పేరు తెచ్చుకున్న నయీం.... అంతకు ముందు నక్సలైటుగా, పోలీస్ ఇన్ ఫార్మర్‌గా కూడా పని చేసాడు. అతనికి టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నయీం జీవితాన్ని తన సినిమా కథగా మార్చుకోవాలని డిసైడైన వర్మ ఇటీవల నయీం మీద సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు కూడా. తాజాగా ట్విట్టర్లో ఓ పోస్టర్ ట్వీట్ చేసాడు. నయీం ఎంత భయంకరంగా హత్యలు చేసాడో..... అంతే భయంకరంగా 'నయీం' మూవీ పోస్టర్ ఉంది.

 సంచలనం రేపుతున్నాడు

సంచలనం రేపుతున్నాడు


వంగవీటి తర్వాత తాను ఇంకో తెలుగు సినిమా చేయనని.. వంగవీటి కంటే గొప్ప స్టోరీ తనకు దొరకదనే అంటూ చాలానే చెప్పిన వర్మ.. ఇప్పుడు నయీమ్ మూవీని మొదలుపెట్టేసి..సంచలనం రేపుతున్నాడు. న‌యీం చ‌నిపోగానే అత‌ని గురించి తెలుసుకున్న వ‌ర్మ న‌యీంకు ఒక సినిమా చాల‌ద‌ని మూడు భాగాలుగా తీస్తాన‌ని సంచ‌ల‌న ప్రకటనలు చేశాడు.

 టైటిల్ సాంగ్‌

టైటిల్ సాంగ్‌


అంతే కాదు ఈమ‌ధ్య‌నే న‌యీమ్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన వ‌ర్మ ఇప్పుడు తాజాగా టైటిల్ సాంగ్‌ను విడుద‌ల చేశాడు. ఇది కాస్తా సంచలనాత్మకంగా మారింది. ఇందులో ఒక సోష‌ల్ మెసేజ్ కూడా ఇచ్చాడు వ‌ర్మ‌. ‘పిల్లలు చిన్నపుడు తప్పులు చేసినప్పుడు గారాబం చేస్తే.. ఆ తర్వాత వాళ్లు పెద్దవుతున్నపుడు సరిదిద్దకపోతే.. చివరకు క్రిమినల్స్ గా మారే ప్రమాదం ఉంటుందంటూ' న‌యీమ్ ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాడు.

 ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా

ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా


ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే న‌యీం సినిమా టైటిల్ లోగో త‌యారు చేయించ‌డంతో పాటు లేటెస్టుగా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. ఐతే ఈ సినిమా తీస్తాన‌న్నందుకు త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు వ‌ర్మ తాజాగా వెల్ల‌డించాడు. దీంతో పాటు న‌యీమ్ గురించి స‌మాచారం తెలుసుకునే క్ర‌మంలో త‌న‌కు తెలిసిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా వ‌ర్మ ట్విట్ట‌ర్లో పంచుకున్నాడు.

 నేను నయీంల‌కు నయీమ్

నేను నయీంల‌కు నయీమ్


"నాకు న‌యీం గ్రూప్ నుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయి. కానీ నేను నయీంల‌కు నయీమ్ అని వాళ్లు తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం నేను ముంబ‌యిలో ఉన్నా. న‌యీంతో కలిసి జైల్లో గ‌డిపిన వ్య‌క్తిని క‌లిశాను. న‌యీంతో స‌న్నిహిత సంబంధాలున్న ఐదుగురు పోలీసుల్ని..అత‌డితో క‌లిసి మూడేళ్లు ప‌ని చేసిన ఇద్ద‌రు నక్స‌లైట్ల‌ను కూడా క‌లిశాను. నేర ప్ర‌పంచం గురించి నాకున్న మొత్తం అవ‌గాహ‌న ప్ర‌కారం చూస్తే క‌రాచిలో ఉన్న వ్య‌క్తితో న‌యీం చాలా చాలా క్లోజ్ అని తెలిసి నిజంగా ఆశ్చర్య‌పోయా'' అని వ‌ర్మ అన్నాడు. ఇక్క‌డ‌ వ‌ర్మ చెబుతున్న క‌రాచి వ్య‌క్తి దావూద్ ఇబ్ర‌హీం అన్న విషయం అర్థమయ్యింది కదా.

 వర్మ కి కొత్త కాదు

వర్మ కి కొత్త కాదు


ఇలాంటి వివాదాస్పద వ్యక్తుల జీవిత కథలని సినిమాగా తీయటం వర్మ కి కొత్త కాదు వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సర్కార్' జూన్, 2005లో విడుదలయింది. నిజ జీవితంలో తండ్రి-కొడుకులయిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి-కొడుకుల పాత్రలు పోషించారు. ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని వర్మ చెప్పిన్పటికీ....ఇది బాల్ థాక్రేను ఉద్దేశించి తీసిందే అని ఆప్పట్లోనే ప్రచారం సాగింది. బల్ థాక్రే మరనించినప్పుడు "థాక్రే లేకుండా సర్కార్ సినిమా లేదు అని చెప్పాదు వర్మ"

 రక్త చరిత్ర

రక్త చరిత్ర


ఆ తర్వాత వచ్చిన రక్త చరిత్ర మరో దుమారమే రేపింది. ఇక ఆ తర్వాత కిల్లర్ వీరప్పన్ అంటూ దేశవ్యాప్తంగా సంచలనం రేపాడు. ఒకప్పటి అడవి దొంగ స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారం గా సినిమా తీసాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ వంగవీటి అనే సినిమాను తీస్తున్నారు. రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం చెలరేగుతున్న సమయంలో ఆయన ఆ సినిమాను మార్కెట్ కూడా చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

 వంగవీటి రాధాతో వివాదం

వంగవీటి రాధాతో వివాదం


ముద్రగడ పద్మనాభం జనవరి 31వ తేదీన నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభలో వంగవీటి రంగా అమర్ రహే అంటూ నినాదాలు వినిపించాయి. కాపు ఐక్య గర్జన ఫ్లెక్సీలు, పోస్టర్ల మీద కూడా ఆయన చిత్రం ప్రముఖంగా ఉంది. కాపుల నేతగా వంగవీటి రంగా పేరు సంపాదించుకున్నారు. వంగవీటి రంగా విషయంలో రామ్ గోపాల్ వర్మ ఆయన కుమారుడు వంగవీటి రాధాతో ఇటీవల వివాదానికి కూడా దిగారు. దాంతో ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు తీయనని ప్రకటించారు.

థీమ్ సాంగ్:


ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే న‌యీం సినిమా టైటిల్ లోగో త‌యారు చేయించ‌డంతో పాటు లేటెస్టుగా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. ఐతే ఈ సినిమా తీస్తాన‌న్నందుకు త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు వ‌ర్మ తాజాగా వెల్ల‌డించాడు. దీంతో పాటు న‌యీం గురించి స‌మాచారం తెలుసుకునే క్ర‌మంలో త‌న‌కు తెలిసిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కూడా వ‌ర్మ ట్విట్ట‌ర్లో పంచుకున్నాడు.

English summary
the maverick director surprised one and all by stating that Nayeem’s shooting is progressing already and that movie will release in January. RGV also unveiled a theme song of ‘Nayeem’ last night.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu