»   » షూటింగ్ సాఫీగా జరగాలని వర్మ శాంతిహోమం

షూటింగ్ సాఫీగా జరగాలని వర్మ శాంతిహోమం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు దేవుడంటే నమ్మకం లేదని అందరూ భావిస్తారు. వర్మ కూడా అదే చెబుతారు. తనకు దేవుడంటే నమ్మకం లేదని చెబుతారు. అలాంటి వర్మ దేవుడి గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం మాట అటుంచింతే ఏకంగా పెద్ద హోమమే చేస్తున్నారని చెబితే నమ్మడం కష్టమే. కానీ వర్మ తన బెజవాడ రౌడీలు షూటింగుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో శాంతి హోమం నిర్వహిస్తున్నారు. విజయవాడలోని షూటింగు స్పాట్‌లో వర్మ బెజవాడ రౌడీలు షూటింగ్ సాఫీగా సాగాలని శాంతిహోమం చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా వర్మ తీస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం పేరును మార్చాలని విజయవాడ ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి అన్నీ అడ్డంకులే వస్తున్నాయంట. దీంతో విరక్తి చెందిన వర్మ షూటింగు సాఫిగా సాగాలని హోమం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పేరు మార్చకుండా శాంతి హోమం చేయడంపై విజయవాడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ రౌడీలు అనే టైటిలు తీసేస్తే వివాదం ఉండదని వారు అంటున్నారు. బెజవాడ రౌడీలు ప్రేమకథా చిత్రం అని చెబుతున్నారని అలాంటప్పుడు రౌడీలు అని పెట్టవలసిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హోమం చేసినా ఏం చేసినా టైటిల్ మార్చే వరకు ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

English summary
Director Ram Gopal Varma organizing a santhi homam at vijayawada shooting spot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu