Don't Miss!
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఎన్టీఆర్‌ను గొప్పవాడిని చేసేంది మేమే. ఆయన కొడుకులు కాదు.. రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ నటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ ముందే కాకుండా విడుదల తర్వాత కూడా వివాదాల్లో కొనసాగుతున్నది. ఏపీలో ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా హైకోర్టు స్టే ఇవ్వడంతో చిత్ర రిలీజ్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాంగోపాల్ వర్మ తనలోని అసంతృప్తిని వెళ్లగక్కాడు. సినిమాను అడ్డుకొన్నంత మాత్రాన నిజం బయటకు రాకుండా ఉండదని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

గొప్పగా చెప్పాలనుకొన్నాను
ఎలాంటి కథనైనా గొప్పగా చెప్పాలనుకొంటాను. అందులో భాగంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీశాను. వివాదాల ద్వారా లబ్ది పొందాలని మాత్రం సినిమా చేయలేదు. ఒకరికి నష్టం చేయడానికి మాత్రం నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందించలేదు అని వర్మ అన్నారు.

రాజకీయాలంటే నచ్చవు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రూపొందించినంత మాత్రాన రాజకీయాల్లోకి వెళ్తాననుకోవడం తప్పు. నాకు రాజకీయాలంటే పడవు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నాకు లేదు. నాకు రాదు. నేను సినిమాలు తీయడానికి ఉంటాను తప్ప మరో బిజినెస్ గానీ, వ్యాపకంగానీ నాకు లేదు అని వర్మ అన్నారు.

ఎన్టీఆర్‌ను అలా చేసింది మేమే
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన తర్వాత ఎన్టీఆర్ పెద్ద కొడుకు అని వచ్చిన కామెంట్‌పై వర్మ స్పందించాడు. అలా నన్ను అనడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌ను మహానుభావువుడిని చేసింది మేమే. వాళ్ల కొడుకులు కాదు. టికెట్లు కొనుక్కొని సినిమాలు చూడటం వల్లే ఎన్టీఆర్ గొప్ప నటుడు అయ్యారు అని వర్మ కామెంట్ చేశాడు.

రిలీజ్ కాకుండా అడ్డుకోవడంపై
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ కాకుండా అడ్డుకోవడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు అడ్డుకొన్నప్పటికీ.. నిజం బయటకు రాకుండా ఆపలేరు. ఈ సినిమా ద్వారా తెలుగుదేశం పార్టీకి లేదా చంద్రబాబుకు నష్టం వస్తుందా? మరోపార్టీకి మేలు చేకూరుతుందా? అనే విషయాలను నేను నమ్మను. పట్టించుకోను అని వర్మ కామెంట్ చేశారు.