For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna Death: కృష్ణ మృతిపై వర్మ సంచలన ట్వీట్.. వాళ్లిద్దరూ హ్యాపీగా గడుపుతారంటూ ఘోరంగా!

  |

  టాలీవుడ్‌లో కొంత కాలంగా వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాంలోనే ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరణంపై ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం కృష్ణ మరణంపై సంచలన కామెంట్స్ చేశాడు. దీనిపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...

  కృష్ణ మరణం.. తీవ్ర విషాదం

  కృష్ణ మరణం.. తీవ్ర విషాదం

  సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకుని.. డేరింగ్ అండ్ డైనమిక్ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కార్డిక్ అరెస్ట్‌తో సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరిన ఆయన.. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

  సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!

  విషాద ఛాయలు... పోస్టులతో

  విషాద ఛాయలు... పోస్టులతో

  టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కృష్ణం మరణంపై పోస్టులు చేస్తున్నారు.

  ఫ్యాన్స్ కోసమే.. చివర్లో మార్పు

  ఫ్యాన్స్ కోసమే.. చివర్లో మార్పు

  సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త ఇటు సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడాలో ఉన్న నివాసానికి తరలించారు. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

  Bigg Boss Telugu 6: కంటెస్టెంట్లకు బిగ్ షాక్.. విన్నర్ అయినా బోడిగుండే.. తెలివిగా సేఫ్ అయిన మోడల్

  కృష్ణ అంత్యక్రియలు అక్కడే

  కృష్ణ అంత్యక్రియలు అక్కడే


  కృష్ణ భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12:30 గంటల వరకు పద్మాలయ స్టూడియో వద్ద అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానానికి తరలిస్తారు. అక్కడ ఆయనకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇది ఈరోజు సాయంత్రానికి జరిగే ఛాన్స్ ఉంది.

  కృష్ణ మరణంపై వర్మ ట్వీట్

  కృష్ణ మరణంపై వర్మ ట్వీట్

  డేరింగ్ అండ్ డైనమిక్ హీరో.. తెలుగు తెరకు ఎన్నో ప్రయోగాలు పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆయన నివాసానికి ఎంతో మంది ప్రముఖులు చేరుకుని నివాళులు అర్పించారు. అలాగే, సోషల్ మీడియాలోనూ పోస్టులు చేసి సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

  Bigg Boss Elimination: ఓటింగ్‌లో ట్విస్ట్.. అతడు సేఫ్ అవడంతో వాళ్లకు షాక్.. డేంజర్‌ జోన్‌లో ఎవరంటే!

  వాళ్లు సంతోషంగా ఉంటారని

  టాలీవుడ్ లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ మరణంపై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎందుకంటే అతడు తన ట్వీట్‌లో 'కృష్ణ గారు మరణించారని బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్వర్గంలో విజయ నిర్మల గారితో కలిసి పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సంతోషంగా గడుపుతుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను' అంటూ రాసుకొచ్చాడు.

  రాంగోపాల్ వర్మపై విమర్శలు

  రాంగోపాల్ వర్మపై విమర్శలు


  సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన అభిమానులు.. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోయారన్న బాధలో ఉంటే.. ఇలాంటి ట్వీట్ చేస్తావా అంటూ అతడిపై విమర్శలు చేస్తున్నారు. కొందరైతే దారుణమైన పదజాలంతో రాంగోపాల్ వర్మను బండ బూతుల తిడుతున్నారు. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

  English summary
  Famous Actor Krishna Passes Away Due to Health Issues. Recently Ram Gopal Varma Post Sensational Tweet on This Tragedy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X