»   » అమితాబ్ సినిమా పైరసీ వీడియో లు అమ్మాడట ఎవరో కాదు రామ్‌గోపాల్ వర్మే

అమితాబ్ సినిమా పైరసీ వీడియో లు అమ్మాడట ఎవరో కాదు రామ్‌గోపాల్ వర్మే

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. సమయం సందర్భాన్ని బట్టి సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉండే వర్మ ఈసారి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. విజయవాడలోని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ ఫెయిల్ కావడంతో ఫైరసీ వీడియోలు అమ్మడం మొదలెట్టానని స్వయాన ఆయన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఆ ఫైరసీ సీడీలు (పైరసీ వీడియో క్యాసెట్ లు) అమితాబ్ బచ్చన్ 'ఆఖరి రాస్తా' సినిమాకు సంబంధించినవి. అయితే అదే హీరోతో ‌'సర్కార్' సినిమా తీయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సర్కార్ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం 'సర్కార్‌ 3' సినిమా తీస్తున్నాడు.

varma

గతం లో కథస్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు చిత్రం చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు పైరసీ గురించి అభిప్రాయం అడుగగా, అందుకు ఆయన స్పందిస్తూ పైరసీ గురించి మాట్లాడేందుకు నేను అర్హుడను కాను అన్నారు.'నా అంతకు నేనూ పెద్ద పైరసీ మాస్టర్" అన్నారు. ఎందుకంటే నేను తీసే సినిమాలన్నీ అల్ మోస్ట్ ఆల్ హాలీవుడ్ చిత్రాలనుండి తీసుకొచ్చేవే అన్నారు.

దర్శకుడు అవ్వకముందు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో షాప్ నడిపేవాడు. అప్పుడు పైరసీ వీడియో క్యాసెట్ లు అమ్మేవాడట. ఆ విషయం తెలుసుకుని పోలీసులు రైడ్ చేసి, లాకప్ లో పెట్టారని రామ్ గాపాల్ వర్మ స్వయంగా చెప్పాడు. అప్పట్లో తెలియక పైరసీ చేశానని, కానీ ఓ సినిమా నిర్మాణం వెనకాల నిర్మాత ఎన్నీ కోట్లు వెచ్చిస్తాడో తెలిసిన తర్వాత పైరసీ చేయడం సరికాదని తెలుసుకున్నానని రామూ చెప్పాడు. అందుకే పైరసీ చేసేవారికి ఈ విషయం అర్థం అయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అతను పేర్కొన్నాడు..

ram gopal

కాగా, రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం 'వంగవీటి' ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌కి అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 20న 'శివ టు వంగవీటి' పేరుతో హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. వంగవీటి సినిమాపై హైప్ తీసుకురావడానికి వర్మ తెలివిగా తన సినిమా జర్నీ పేరుతో.. బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలతో ఒక కార్యక్రమం నిర్వహించి 'వంగవీటి'ని మళ్లీ వార్తల్లో నిలపాలని ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్ జనం చెప్తున్నారు.

English summary
The new latest news we heared from Ram Gopal Varma is that he sold pirated videos of Amitabh Bachchan's Aakhri Raasta.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu