Don't Miss!
- Travel
సందర్శకులు మెచ్చే పర్యాటక మణిహారం.. కాకినాడ తీరం!
- News
YS Jagan-Navy Talks : జగన్ తో నేవీ అధికారుల భేటీ..విశాఖ తీరంలో సవాళ్లపై .. !
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Sports
ఆ అవకాశాన్ని చేజార్చుకోవడంపై ఇప్పటికీ బాధపడుతున్నా: పృథ్వీ షా
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
'ఎవడికి దమ్ముందో ఆపుకోండి'.. మీరు ఊహించుకోవడం మాత్రమే.. రాంగోపాల్ వర్మ!
అంతా ఆసక్తిగా ఎదురుచూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రాలో విడుదల కాలేదు. తెలంగాణ, యూఎస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆంధ్ర హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సంగతి తెలిసిందే. కోర్టు సమస్యలు తీరాక ఈ చిత్రం ఆంధ్రాలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిత్రని మే 1 న ఆంధ్రలో విడుదల చేయనున్నట్లు వర్మ ఇటీవల ప్రకటించారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో వివాదం కొనసాగుతోనే ఉంది. రాంగోపాల్ వర్మ విజయవాడ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్న సంగతి తెల్సిందే.

ఎవరి వద్దా సమాధానం లేదు
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి విజయవాడలో తమ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై స్పందించారు. ఎందుకు మా మీడియా సమావేశాన్ని అడ్డుకుంటున్నారు అని ప్రశ్నిస్తే.. మీరు విజయవాడలో ఉండకూడదు సర్ అంటున్నారు.ఎందుకు అని ప్రశ్నిస్తే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు ఎవరివద్దా సమాధానం లేదు అని రాకేష్ రెడ్డి తెలిపారు. త్వరలోనే వీళ్ళ కుళ్ళు, కుతంత్రాలు బయట పడతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్ద రిటర్న్ గిఫ్ట్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారికి తెలంగాణలో రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. త్వరలో ఆంధ్రాలో కూడా పెద్ద రిటర్న్ గిఫ్ట్ అందుకోబోతున్నారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి బెదిరింపులకు, చేష్టలకు తాను కానీ, రాంగోపాల్ వర్మ కానీ భయపడడం అని రాకేష్ రెడ్డి తెలిపారు. రాజధాని అని చెప్పుకునే అమరావతిలో ఒక సినిమా ప్రెస్ మీట్ జరిగే పరిస్థితులు లేవని అన్నారు.

అలా ఊహించుకున్నారు
ఓ మీడియా ప్రతినిథి ఆర్జీవిని ప్రశ్నిస్తూ.. నేను విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తున్నాను.. ఎవడికి దమ్ముందో ఆపుకోండి అనే వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని ప్రశ్నించగా.. తాను అలా మాట్లాడలేదని వర్మ తెలిపాడు. ప్రెస్ మీట్ పెడుతున్నాను అని మాత్రమే చెప్పా.. మిగిలినదంతా మీరు ఊహించుకుని చెబుతున్నారు అంతో వర్మ క్లారిటీ ఇచ్చాడు.

అలాగే అనుమానించాల్సి వస్తుంది
మిమ్మల్ని ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలైతే ఎవరికి నష్టం జరుగుతుందో అందరికి తెలుసు.. కాబట్టి వారినే అనుమానించాల్సి వస్తుంది అని వర్మ తెలిపారు. అధికారింగా ఒక రిపోర్ట్ కూడా లేదు.. కారణం కూడా లేదు.. అడిగితే సమాధానం ఉండదు.. కానీ మాపై అధికారులు చెప్పారు అంటూ పోలీసులు తమని అడ్డుకుంటున్నారు. ఈ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి అని వర్మ ప్రశ్నించారు.