»   » రామ్ గోపాల్ వర్మ ఐడియాస్ అన్నీ ఇలా అయిపోతున్నాయే..

రామ్ గోపాల్ వర్మ ఐడియాస్ అన్నీ ఇలా అయిపోతున్నాయే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

థియేటర్ లో ఒకటి, సెట్స్ మీద ఒకటి, పేపర్ మీద ఒకటి, మైండ్ లో మరొకటి...ఇలా సాగుతున్నాయి వర్మ గారి సినిమాలు. అవును థియేటర్ లో రక్త చరిత్ర ఉంటే, సెట్స్ మీద అప్పల్రాజు ఉంది, పేపర్ మీద బెజవాడ రౌడీలు, మైండ్ లో 'అమ్మ త్రీ డీ" ఇలా వర్మ ఒకేసారి అన్ని సినిమాలు ఒక దాని వెంట ఒకటి రెడీ చేసేస్తున్నాడు. తాజాగా సైలెంటుగా 'బెజవాడ రౌడీలు" సినిమా పనులు కూడా మొదలు పెట్టేసాడట. కథ-స్ర్కీన్ ప్లే పాటలు..వగైరా పనులన్నీ అయిపోతున్నాయని సమాచారం. బొంబాయికి చెందిన బాలీవుడ్ సంగీత దర్శకలు దీనికి పనిచేస్తున్నారంటున్నారు. ఇదిలా వుంటే మరో పక్క 'అమ్మ త్రీ డీ" సినిమాకి నిర్మాతను వెతుక్కునే పనిలో ఉన్నాడు వర్మ గారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu