twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ సెటైర్లు

    By Bojja Kumar
    |

    సినిమా దర్శకుల్లో రాంగోపాల్ వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. రియల్ కథలను తెరకెక్కించడంలోనూ, వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ చేయడం లోనూ వర్మ స్టైలే వేరు. ఏదైనా విషయం అనుకుంటే...ఎన్నివిమర్శలు వచ్చినా దాన్ని పూర్తి చేసే పట్టుదల గల మనిషి. తన మాటే నెగ్గాలనే మొండి ఘటం. ఉగ్రవాద దాడులు లాంటివి జరిగితే దాన్నిపై సినిమా తీసి సొమ్ము చేసుకోవాలని ఆలోచచన చేసే రకం.

    అయితే ఇదంతా ఒకప్పడు. తాజాగా వర్మలో మెల్లిమెల్లిగా మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. 'బెజవాడ రౌడీలు" టైటిల్ లో చోటు చేసుకున్న మార్పు పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు పేలుడు ఘటనపై వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా అయనలో మార్పు వచ్చినట్లు స్పష్టం చేస్తున్నాయి.

    ఢిల్లీ బాంబు పేలుళ్లపై రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ లో స్పందిస్తూ....'' దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా గవర్నమెంటు ఒకే డైలాగులు వళ్లిస్తోంది. ఇది ఉగ్రవాదుల పిరికి చర్య, ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికే ఇలా చేస్తున్నారంటూ ప్రకటనలు చేస్తోంది. సర్కార్ ప్రతిసారి ఇవే డైలాగులు వెళ్లించడం బోర్ గా ఉంది. ఎవరైన కొత్త రైటర్ ను పెట్టుకోండి. మంచి డైలాగులు రాసిస్తాడు"" అని పేర్కొన్నాడు.

    ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ప్రభుత్వ చేతకాని తనాన్ని ఎండగట్టాడు వర్మ. హైకోర్టు లాంటి ప్రదేశాల్లోనే భద్రత లేకుంటే...మామూలు ప్రదేశాల్లో పరిస్థితి ఏమిటని ఆయన పరోక్షంగా ప్రశ్నించాడు. మళ్లీ దాడులు జరుగకుండా అడ్డుకునే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు...అందుకే ఇప్పడే డైలాగులు సిద్ధం చేసుకోండి అని చెప్పకనే చెప్పారు.

    English summary
    Ram Gopal Varma tweeted – “Government should hire dialogue writers for fresh lines instead of repeating done 2 death linesit’s a cowardly act its an act to destabilize state etc”. Those who read this say it is a shock to see Ramu showing compassion in his own form.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X