»   » యూటర్న్: నాగబాబుపై సెటైర్లతో చెలరేగిన రామ్ గోపాల్ వర్మ

యూటర్న్: నాగబాబుపై సెటైర్లతో చెలరేగిన రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు వ్యాఖ్యలకు స్పందిస్తూ చిరంజీవి కుటుంబానికి క్షమాపణలు చెప్పిన కొద్దిసేపటికే రామ్ గోపాల్ వర్మ యూటర్న్ తీసుకున్నారు. నాగబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలతో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు తనవి కావని చెప్పుకున్నారు. ఎవరో ఇడియట్ తన అకౌంట్‌ను హ్యాక్ చేశాడని అన్నారు.

తానెప్పుడూ తెలుగులో ట్వీట్ చేయలేదని, ఎవరో తన ఖాతాను హ్యాక్ చేసి కామెంట్లు పెట్టారని చెప్పారు. ఆ తర్వాత నాగబాబుపై విరుచుకుపడ్డారు. "నాగబాబు సారూ... మీకు ఇంగ్లీషు అర్థం కాకపోతే ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన మిత్రుడితో నా ట్వీట్లను తెలుగులోకి అనువాదం చేయించుకోండి" అని సూచించారు.

Ram Gopal Varma

"మీ అన్నయ్య గురించి మీకు 0.1 శాతం కూడా తెలియదు. మీ అన్న గొప్పతనం గురించి ఎందుకు మాట్లాడుతారు" అని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నాశనానికి నాగబాబు ఇచ్చిన సలహాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. "నువ్వు ఎంతు ఘాటుగా మాట్లాడితే అంత ఘాటుగా నేను సమాధానం ఇస్తాను" అని చెప్పారు.

తన కెరీర్ గురించి మాట్లాడే ముందు నాగబాబు ఆయన జబర్దస్త్ కెరీర్ ఏమిటో చూసుకోవాలని ఆయన అన్నారు. తన కెరీర్ బాగానే ఉందని ఆయన అన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమా ట్రైలర్ ఫెంటాస్టిక్ అని కూడా అన్నారు.

English summary
Ram Gopal Varma retweeted making comments against Nagababu. He said that Nagababu doesn't know about Chiranjeevi's greatness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu