»   » సమైక్య ఉద్యమం : చిరును టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్లు

సమైక్య ఉద్యమం : చిరును టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: వివాదాల్లో వేలు పెట్టడంలో అయినా...వివాదాలు కావాలని సృష్టించడంలో అయినా....అందరికంటే ముందండే వ్యక్తి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పబ్లిసిటీ కోసమే ఇదంతా అని కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో వర్మ పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర మంత్రి, ఒకప్పటి సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ తన ట్విట్టర్లో ట్వీట్లు చేసారు. ఒక వేళ 'సమైక్యాంధ్ర ఉద్యమం' సినిమాలో చిరంజీవిని హీరో పెడితే ఆయన దీన్ని ఎలా డీల్ చేస్తారు? అంటూ ట్వీట్ చేసారు. వర్మ వ్యాఖ్యలు సమైక్య ఉద్యమానికి అంటీముట్టనట్లు ఉంటున్న చిరంజీవిపై సెటైర్‌లా ఉందని కొందరంటున్నారు.

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలకు తెలుగు సినీరంగ ప్రముఖులు ముందు నుండీ దూరంగా ఉంటూ వస్తున్నారు. కొందరికి ఆయా ఉద్యమాలపై మమకారం ఉన్నా మరో ప్రాంతంలో ఉన్న అభిమానుల మనో భావాలు దెబ్బతీసినట్లు అవుతుందని, కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో ఏ ఉద్యమానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటున్నారు. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ విషయంలో తన దైన దారిలో ముందుకు సాగుతున్నారు.

ట్విట్టర్ ద్వారా ఆయన చెబుతున్న విషయాలను బట్టి రాష్ట్ర విభజన నిర్ణయంపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తెలుగు వారంతా సమైక్యంగా ఒకే రాష్ట్రంలో ఉండాలనే తపన ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను ప్రశంసించారు. 'సమైక్యాంధ్ర ఉద్యమానికి ఏ నాయకత్వం, నాయకుడు లేడు. ప్రజలే స్వచ్ఛందంగా మనస్ఫూర్థిగా ఉద్యమంలోకి దిగారు' అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. "సాంకేతికపరమైన అంశాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ తెలుగు వాళ్లను విడగొట్టడానికి ఓ ఇటాలియన్, ఓ కన్నడిగ, ఓ తమిళియన్, ఓ బీహారి, ఓ హిందీ చేతులు కలపడమే బాధాకరంగా ఉంది'' అని వర్మ ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల బీజేపీ ఎన్నికల ప్రచార రథ సారథి నరేంద్రమోడీ హైదరాబాద్ సందర్భంలో.....మోడీ తన సభముగింపులో జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేసారు. ఆయన మహా తెలివైన వారు అంటూ తన ట్విట్టర్లో కామెంట్ చేసారు.

English summary
"If Samaikhyandra agitation was a film and Chiranjeevi was the hero in it, I wonder then how he would have dealt with it?. To my knowledge the samaikhyandra agitation must be the first in the world to happen without any leader/leaders provoking or leading it. The samaikyandra movement is just a sponataneous outburst of human heart felt emotions uncorrupted by political agendas." Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu