»   » పెప్పర్ స్ర్పే: లగడపాటిపై వర్మ ప్రశంసలు

పెప్పర్ స్ర్పే: లగడపాటిపై వర్మ ప్రశంసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా నిండు సభలో ఎంపీలపై పెప్పర్ స్ర్పే చల్లిన కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అందరినీ భయ భ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పార్లమెంటు చరిత్రలో ఇదొక మాయని మచ్చ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే లగడపాటి స్నేహితుడు, వివాదాస్పద దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మాత్రం రాజగోపాల్ చర్యను సమర్థించారు. ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసారు. రాజగోపాల్‌ను వర్మ భగత్ సింగ్‌‌తో పోల్చారు. 'భగత్ సింగ్ తర్వాత పార్లమెంటును షాక్‌కు గురి చేసింది రాజగోపాల్ మాత్రమే. భగత్ సింగ్ భారత్ కోసం...రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ కోసం చేసాడు' అంటూ ట్వీట్ చేసారు.

Ram Gopal Varma tweet about Lagadapati pepper spray

ఇప్పటి వరకు పెప్పెర్ స్ర్పేకు పెద్దగా పాపులారిటీ లేదు. పార్లమెంటులో జరిగిన చర్యతో పెప్పర్ స్ప్రేకు పాపులారిటీ బాగా పెరిగింది. ఇకపై చాలా మంది దీన్ని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉంది అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. పెప్పర్ స్ప్రే వాడటం చట్టబద్దమే. ఇకపై చాలా మంది దీన్ని ఉపయోగిస్తారు అని అభిప్రాయ పడ్డారు.

భవిష్యత్తులో క్లాసు రూములు, మూవీ థియేటర్లు, షాపింగు మాల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెప్పర్ స్ప్రేలు వాడిన సంఘటనలు మనం చూడబోతున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

English summary
"After Bhagat Singh it's only Lagadapati who shook parliament...The first one was for India and the 2nd is for Andhra Pradesh" Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu