»   » శ్రీదేవి పై ఇంకో ట్వీట్ వేసాడు: ఈసారి లక్స్ సొప్ అడ్డుపెట్టుకొని (అరుదైన శ్రీదేవి ఫొటో తో )

శ్రీదేవి పై ఇంకో ట్వీట్ వేసాడు: ఈసారి లక్స్ సొప్ అడ్డుపెట్టుకొని (అరుదైన శ్రీదేవి ఫొటో తో )

Posted By:
Subscribe to Filmibeat Telugu

''అయ్యయ్యో.. శ్రీదేవి ఇంత అందంగా ఉండడానికి కారణం లక్స్ అని నాకు ఇంతవరకు తెలీదే..!'' అంటూ ఫన్నీగా ట్వీటేశాడు వర్మ.తాను దర్శకుడు కావటానికి శ్రీదేవి తొడలు కూడా ఒక కారణం అని చెప్పి ఆమె భర్త బోనీ కపూర్ ఆగ్రహానికి గురైన వర్మ ఎవరేమన్నా తన పంథా మార్చుకునేలా లేడు

లక్స్ సోప్‌

లక్స్ సోప్‌

మధుబాల, సైరా భాను, మీనాకుమారి, హెలెన్, మాలా సిన్హా, సాధనా, బబిత, ఆశాపరేఖ్, హేమా మాలిని, రేఖ, జీనత్ అమన్, రతి అగ్నిహోత్రి, విద్యా సిన్హా వంటి తారామణులు తమ కాలంలో, తర్వాత శ్రీదేవి, మాధురీ దీక్షిత్ , జూహీ చావ్లా 80ల్లో లక్స్ సోప్‌కు ప్రతినిధులుగా ఓ వెలుగు వెలిగారు..

లక్స్ బ్రాండ్ కు ప్రచారకర్త

లక్స్ బ్రాండ్ కు ప్రచారకర్త

అయితే వీరందరిలోనూ అటు బాలీవుడ్ కీ ఇటు టాలీవుడ్ కీ టచ్ ఉన్న శ్రీదేవి అప్పట్లో ఎక్కువగానే పాపులర్ అయ్యింది.., లక్స్ అమ్మకాలని పెంచింది కూడా. అప్పట్నుంచీ లక్స్ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించడం సినీ తారలకు ఓ హోదాగా మారిపోయింది... కాస్తో కూస్తో పేరు సంపాదించుకున్న ప్రతి నాయికా లక్స్ సబ్బు రుద్దుకుని ప్రచారం చేయటానికి ఆరటపడేవారు...

శ్రీదేవి తరం తర్వాత

శ్రీదేవి తరం తర్వాత

శ్రీదేవి తరం తర్వాత కరిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, అమీషా పటేల్, టబు కూడా లక్స్ భామలుగా వెలుగొందారు.. దీంతో లక్స్ ప్రతి ఇంటా స్నానాల గదిలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది... ప్రస్తుతం కరీనా కపూర్, ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకోనే లక్స్ పాపలుగా రాజ్యమేలుతున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఎంతో మంది తారలు లక్స్ బ్రాండ్ అంబాసిడర్స్‌గా ప్రేక్షకులను మైమరపించారు.. తాజాగా ఆలియా బట్ లక్స్ పాపగా మనముందుకు రానుంది...

శ్రీదేవి గురించి ఓ ఫన్నీ ట్వీట్

శ్రీదేవి గురించి ఓ ఫన్నీ ట్వీట్

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో రోజు ప్రారంభించి..ముగించే రామ్‌గోపాల్ వర్మ అని చెప్పడంలో సందేహమే అవసరం లేదు. తాజాగా శ్రీదేవి గురించి ఓ ఫన్నీ ట్వీట్ పెట్టాడు వర్మ. శ్రీదేవి అందంపై కామెంట్ చేశాడు. ‘తన అందం గురించి లక్స్ ఎంతో శ్రద్ధ తీసుకోవడాన్ని శ్రీదేవి ఎప్పుడూ అభిమానిస్తుంటుంది' అన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసి..

శ్రీదేవి తొడలు కూడా

శ్రీదేవి తొడలు కూడా

‘‘అయ్యయ్యో.. శ్రీదేవి ఇంత అందంగా ఉండడానికి కారణం లక్స్ అని నాకు ఇంతవరకు తెలీదే..!'' అంటూ ఫన్నీగా ట్వీటేశాడు వర్మ.తాను దర్శకుడు కావటానికి శ్రీదేవి తొడలు కూడా ఒక కారణం అని చెప్పి ఆమె భర్త బోనీ కపూర్ ఆగ్రహానికి గురైన వర్మ ఎవరేమన్నా తన పంథా మార్చుకునేలా లేడు

English summary
"Oh Hell ! I never knew it's Lux which made SrideviBKapoor so Beautiful" Tweets Ram gopal varma
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu