»   » ఆయన ఎన్నిసార్లు రేప్ చేసాడో? వర్మ సంచలన వ్యాఖ్య

ఆయన ఎన్నిసార్లు రేప్ చేసాడో? వర్మ సంచలన వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య ట్విట్టర్ ద్వారా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంత కాలంగా ఆయన చేసిన కొన్ని ట్వీట్లు చూసిన కొందరు....వర్మ కాస్త తేడాగాడు అని సరిపెట్టుకున్నారు. అయితే ఆయన ఈ సారి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగు యాదవ్‌ను ఉద్దేశించిన ట్వీట్‌పై...పలువురు హర్షం వ్యక్తం చేసారు. వర్మ ట్వీట్ సూపర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకీ వర్మ ఏమని ట్వీట్ చేసాడంటే...
''ములాయం సింగ్ అలా అత్యాచార నిందితులని వెనకేసుకొచ్చాడంటే కచ్చితంగా ఆయనలో ఓ రేపిస్ట్ వుండే వుండుంటాడు. అంతేకాదు, ములాయం యువకుడిగా వున్నప్పుడు ఎన్నిసార్లు అత్యాచారం చేశాడోనని వర్మ అనుమానం వ్యక్తం చేశాడు. లేదంటే అత్యాచారం చేయాలనే ఆలోచనైనా చేసి వుంటాడు'' అని వర్మ ట్వీట్ చేసారు.

 Ram Gopal Varma tweet on Mulayam Singh

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రేపిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. యువకులు తప్పు చేయడం సహజం, అంత మాత్రానికే వారికి మరణ శిక్ష విధించడం సరికాదు, చట్టాల్లో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తాం అంటూ ములాయం సింగ్ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మొరాదాబాద్ ఎన్నికల ప్రచార సభలో ములాయం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిందితులకు ఉరి తీయడం సరికాదు, యువకులతో అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతాయి అని వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన రెండు సామూహిక అత్యాచారం కేసుల్లో ముగ్గురు దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించిన సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

English summary
Director Ram Gopal Varma, who has demanded severe punishment for Rapists in the past, has reacted sharply on Samajwadi party chief Mulayam Singh's comments opposing anti rape law.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu