KGF 2 మాన్‌స్టర్.. బాలీవుడ్‌ టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ.. స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై సెటైర్

దక్షిణాది సినిమాలు దక్షిణాదికి పరిమితం కాకుండా ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ దండయాత్ర బాహుబలి 2, కేజీఎఫ్, పుష్ప ఇప్పుడు మళ్ళీ కేజీఎఫ్ వరకు కొనసాగుతోంది. ఇక యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదలై సత్తా చాటడంతో ఈ సినిమా గురించి రకరకాలుగా స్పందిస్తున్నారు సెలబ్రిటీలు. తాజాగా ఈ సినిమా గురించి వర్మ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రశంసలు

ప్రశంసలు

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం KGF 2. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సంజయు దత్, రవీనా టాండన్, రావు రమేష్,ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, బాలకృష్ణ వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. అలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన KGF 2 సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ కు అటు ప్రేక్షకులు మాత్రమే కాదు ఇటు సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

130 కోట్లు రాబట్టి

130 కోట్లు రాబట్టి

గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగా దానికి సిక్వెల్‍గా వచ్చిన కేజీఎఫ్ 2 అంతకు మించి అన్నట్టుగా థియేటర్లలో దూసుకుపోతుంది. విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మొదటి రోజే రూ. 130 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ అని అంటున్నారు. కేజీఎఫ్ హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 పెద్ద చర్చకే దారి తీసి

పెద్ద చర్చకే దారి తీసి

ఆ సంగతి పక్కన పెడితే విడుదల రోజే డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఈ సినిమాపై త‌న‌దైన స్టైల్‌లో ట్వీట్ పెట్టి..టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. వ‌ర్మ బాలీవుడ్ ను మెన్షన్ చేస్తూ ట్వీట్ చేయ‌డం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్ 2 ఓపెనింగ్ క‌లెక్ష‌న్ల‌నుద్దేశించి వర్మ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన చిత్రాల లిస్టును షేర్ చేస్తూ..బాలీవుడ్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రాలుగా క‌న్నడ డ‌బ్బింగ్ మూవీ కేజీఎఫ్ 2, తెలుగు డ‌బ్బింగ్ మూవీ బాహుబ‌లి 2 ఉండ‌టం ప‌ట్ల‌...హిందీ ఫిలిం ఇండ‌స్ట్రీ (బాలీవుడ్‌) ఏం ఆలోచిస్తుంద‌ని..మీరు అనుకుంటున్నారు..అని అడుగుతూ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. ఇది పెద్ద చర్చకే దారి తీసింది.

స్పష్టమైన రుజువు

స్పష్టమైన రుజువు


ఆ చర్చ అలా ఉండగానే ఆయన మరో ట్వీట్ చేశారు. స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని దానికి "కేజీఎఫ్-2" మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ ట్వీట్ చేశారు. "స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యత, గొప్ప హిట్‌లు వస్తాయి అనడానికి KGF 2 మాన్స్టర్ హిట్టే స్పష్టమైన రుజువు" అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Recommended Video

KGF Chapter 2 సంచలనం ..RRR,హాలీవుడ్ మూవీ కూడా వెనక్కే..| Oneindia Telugu
ఇప్పుడు మాట మార్చి

ఇప్పుడు మాట మార్చి


అయితే గత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించినప్పుడు ఇదే చర్చ తెరమీదకు వచ్చింది. హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకుంటే సినిమా తక్కువ బడ్జెట్ లోనే పూర్తవుతుందని ప్రభుత్వ పెద్దలు కామెంట్ చేయగా అప్పుడు వారికి సినిమాల మీద అవగాహనా లేదని విమర్శించినా వర్మ ఇప్పుడు మాత్రం మళ్ళీ రివర్స్ లో ఇలా కామెంట్ చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X