»   » పవన్ కన్నా బన్నీ నే పెద్ద స్టార్, ఈ కెలుకుడేంది స్వామి?

పవన్ కన్నా బన్నీ నే పెద్ద స్టార్, ఈ కెలుకుడేంది స్వామి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను వదిలి ముంబై వెళ్లాను అన్నా వర్మ దృష్టి మొత్తం ఇక్కడ సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా ఆయన పవన్ ని, ఆయన అభిమానులను మాత్రం ఏదో విధంగా టార్గెట్ చేయటం మాత్రం మానలేదు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కామెంట్ చేశారు. పవర్‌స్టార్‌, స్టైలిష్ స్టార్‌లను పోల్చుతూ ట్వీట్ చేసారు ఆర్‌జీవి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అని ప్రశ్నిస్తూ తన దైన కారణం వివరించారు.

తానెప్పుడూ బన్నీని పవన్ కళ్యాణ్‌తో పోల్చి చూడలేదని, కానీ సరైనోడు సినిమాతో పవన్ కన్నా బన్నీనే పెద్ద స్టార్ అయ్యాడని చెప్పారు వర్మ.

సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ కన్నా బన్నీ నటించిన సరైనోడు పెద్ద హిట్ కొట్టింది కాబట్టి పవన్ కన్నా అల్లూ అర్జున్ ఎక్కువా..? అంటూ ప్రశ్నించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma tweets about Bunny & Pawan

ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' సూపర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకుందని చిత్రం పీఆర్వో టీమ్ విడుదల చేసిన కలెక్షన్స్ చెప్తున్నాయి. ఆ లెక్కలు ప్రకారం...నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అంటే...సినిమాపై మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది వసూళ్లపై ప్రభావం చూపలేదనే అర్దమవుతోంది. బన్నీ పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యాన్స్ ను ఫిదా చేసిందని ,వారే సినిమాని మౌత్ టాక్ తో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్తున్నారు.

దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్న 'సరైనోడు' కలెక్షన్లతో బన్నీ రికార్డు సృష్టిస్తున్నాడని అంటున్నారు.బన్ని నటించిన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు రూ.50 కోట్ల మార్కును దాటేశాయి. అయితే ఈ సారి బన్ని సినిమా నాలుగు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం టాలీవుడ్ లో విశేషం గా వర్ణిస్తున్నారు.

English summary
Ram Gopal Varma ‏ tweeted: Since Sarainodu is a far far bigger hit than a far far bigger Sardar Gabbar Singh is Bunny far far bigger? ..just asking. I never thought anything about Bunny compared to him but am so very surprised that with Sarainodu he became so much bigger than him
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu