»   » గాంధీ గారి భారత ఆత్మ దెయ్యంలా..రామ్ గోపాల్ వర్మ

గాంధీ గారి భారత ఆత్మ దెయ్యంలా..రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం రక్త చరిత్ర ప్రమేషన్ లో భాగంగా ప్రోమోలు రిలీజ్ చేసారు. ఆ ప్రోమోల్లో ఆయనే వాయిస్ ఓవర్ చెబుతూ..ఓ ప్రోమో వస్తుంది. ఆ ప్రమోలో విజువల్స్ చూపుతూ..ఈ క్రింద విధంగా వాయిస్ వస్తుంది. దానిని రామ్ గోపాల్ వర్మే చెప్పటం విశేషం.

భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మహాత్మాగాంధీ. అది ఆయనకున్న ఆశయమో..అప్పటికున్న సత్యమే తెలియదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగే మారణ హోమాలు యుద్ద భూములని మరిపిస్తూంటాయి. అలాంటి ఒక యుద్దభూమే అనంతపురం. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం ఆధిపత్యం కోసం ఆస్తుల్ని,బంధాల్ని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలని కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువులను అత్యంత దారుణంగా చంపటమే తమ జీవిత పరమావధిగా భావిస్తారు ఈ ప్రాతంలోని కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని ఈ మారణ కాండని చూస్తుంటే...గాంధీ గారి భారత ఆత్మ ఇక్కడ బ్రతకటం అటుంచి వీధి వీధినా దెయ్యమై తిరుగుతోందా అనిపిస్తుంది. ఈ కథ మహాభారత గాధను మించిన యధార్ధ కథ. ఇది రక్త చరిత్ర.

ఈ వాయిస్ ఓవర్ తో విజువల్స్ చూపుతూ కట్ చేసిన ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది. హింస నేఫద్యంలో చేసిన సినిమాకు అహింస భోదన చేసిన గాంధీ ప్రస్దావన తేవటమే ఇక్కడ విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu