»   » రామ్ గోపాల్ వర్మ - రాజమౌళి పోటాపోటి...

రామ్ గోపాల్ వర్మ - రాజమౌళి పోటాపోటి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు తెర మీద ఎన్నోసార్లు వండి వార్చేయగా ఎండిపోయిన 'ఫ్యాక్షన్" రసానికి కొత్త రుచులు జోడించడానికి ఇద్దరు ఉద్దండ దర్శకులు నడుం కట్టారు. రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర" సినిమాకి ఫ్యాక్షనిజమే నేపథ్యమన్న సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజమౌళి కూడా 'మర్యాద రామన్న" సినిమా కోసం ఫ్యాక్షనిజాన్నే బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడు. అయితే రాము 'రక్త చరిత్ర" పూర్తి స్థాయి సీరియస్ సినిమా కాగా, రాజమౌళి 'మర్యాద రామన్న"ఫ్యాక్షన్ కత్తులతో కామెడీ చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు నెల రోజుల వ్యవధిలో విడుదలకి సిద్ద పడుతున్న నేపథ్యంలో మరోసారి తెలుగు తెరసై ఫ్యాక్షన్ కథలు పుట్టుకొస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రేక్షకులు రాజమౌళి చేసే కామెడీని ఆదరిస్తారో లేక రాము చూపించే నిజమైన ఫ్యాక్షనిజానికి పట్టం కడతారో అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాల మీద ప్రేక్షకుల్లో, వాణిజ్య వర్గాల్లో అంచనాలు భారీగా వున్నాయి. అందుకు తగ్గేట్టే రెండిటి వ్యాపారం కూడా అంచనాలకు మించి జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu