»   » నేను గే కాదు అయినా అతనితో "లిప్ లాక్" చేయాలనుంది: ఆర్జీవీ

నేను గే కాదు అయినా అతనితో "లిప్ లాక్" చేయాలనుంది: ఆర్జీవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

వర్మ చేసే కామెట్లూ,వ్యాఖ్యలూ ఎలా ఉంటాయో తెలిసిందే కదా.. మామూలు అంశాన్ని కూడా మిన్ను విరిగి మీద పడ్డ లెవెల్లో అంత తీవ్రంగానూ చెప్తాడు వర్మ. కొన్ని సార్లు అత్యంత మేధావి గా అనిపించే వర్మ మరికొన్ని సార్లు సైకో లా అనిపిస్తాడు...అయితే ఈసారి మాత్రం వేరే రకమైన కామెంట్ తో అనురాగ్ కాశ్యప్ ని భయపెట్టాడు ఆర్జీవీ.

అనురాగ్ కాశ్యప్ ని ఉద్దేశిస్తూ అతనితో లిప్ లాక్ చేయాలనుందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు రాం గోపాల్ వర్మ. ఈ మధ్య జరుగుతున్న "ఉడ్తా పంజాబ్" వివాదం నేపథ్యం లో ముంబై హైకోర్టు సెన్సార్ ని తప్పు పడుతూ ఉడ్తా పంజాబ్ యూనిట్ తరఫున మాట్లాదతం తో సంతోషం పట్టలేని వర్మ ఈవిధంగా స్పందించాడు.

Ram Gopal Varma Wants to Lip Lock with Anurag Kashyap

"మనిద్దరం "గే"లు కాకపోయినప్పటికీ సెన్సార్ బోర్డు మీద మీరు చేసిన పోరాటానికి.. మీ నోట్లో నోరు పెట్టి ముద్దాడాలని ఉంది" అని ట్వీట్ చేశాడు వర్మ. ఐతే వర్మ ట్వీట్ కి అనురాగ్ కశ్యప్ రిప్లై కూడా ఇవ్వలేదు. మొన్నటికి మొన్న తనకు సప్పోర్ట్ గా వచ్చిన రజకీయ పార్టీలను కూడా తిట్టి పోసిన అనురాగ్. ఇప్పుడు వర్మ విశయం లోనూ అదె పద్దతి పాటించాడు.

రామ్ గోపాల్ వర్మ సినిమాలు చాలా వాటికి సెన్సార్ వాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ మధ్య సెన్సార్ బోర్డు తీరు మరీ శ్రుతి మించి పోతుండటంతో వర్మ వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. "ఉడ్తా పంజాబ్" విషయంలో అయితే సెన్సార్ ట్వీట్ లతో చెలరేగిపోయాడు. "ఉడ్తా పంజాబ్" సెన్సార్ బోర్డుపై సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ పెద్ద పార్టీ చేయాలని.. దానికి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరవ్వాలనీ.. అలా రాని వారిని వెన్నుపోటుదారులుగా భావించాలని..ట్వీట్ల మీద ట్వీట్ లు చేసాడు...

English summary
Ram Gopal Varma came forward to support the bollywood film maker Anurag Kashyap regarding the ongoing controversy Udta Punjab. RGV has posted some series of tweets in support to the film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu