Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమ్మాయిలను తడిబట్టల్లో చూడటానికే హోళీ: వర్మకి ఇంకా తగ్గలా
వర్మ అంటే ట్విట్టర్, ట్విట్టర్ అంటే రామ్ గోపాల్ వర్మ అన్నట్టు తయారయ్యింది వ్యవహారం. ప్రపంచం లో జరిగే ప్రతీ సంఘటన మీదా స్పందిస్తూనే ఉంటాడు. అసలు ఏదైనా కొత్త సంఘటన జరిగినా, పండగ వచ్చినా రామ్ గోపాల్ వర్మ ఈసారి ఏం ట్వీట్ పెట్టాడా అని చూడటం జనాలకీ, మీడియాకీ మామూలైపోయింది. దసరా, అమెరికా ఎన్నికలు, జయలలిత మరణం, జల్లికట్టు ఇలా విషయం ఏదైనా సరే వర్మ ట్విట్టర్ లో ఏదో ఒక నెగెటివ్ పోస్ట్ పెట్టటం దానికి మిగతా జనమంతా బీపీ పెంచుకోవటం సర్వసాధారణం అయిపోయింది.
మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున ఆడవాళ్ళంతా సన్నీ లియోన్ లా మగవాళ్ళకి ఆనందం పంచాలి అంటూ ఒక ట్వీట్ పెట్టి దేశవ్యాప్తంగా విమర్శలను మూటగట్టుకున్న వర్మ మళ్ళీ వారం తిరక్కుండానే హోళీ పండగ మీద కూడా మరో ట్వీట్ పెట్టి వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. అసలే మనోభావాలు దెబ్బతినే సీజన్ లో ఇంకోసారి వివాదాస్పదంగా స్పందించి జనాల మనోభావాలు దెబ్బతింటాయని రియలైజ్ అయ్యాడేమోగానీ మళ్ళీ వెంటనే అవన్ని తీసెసాడు. ఇంతకీ మనోడి హోళీ స్పెషల్ ట్వీట్ లు ఏమిటంటే....

"ఈ దేశం లోఉన్న 120 కోట్ల మందికి హోళీ ఏకారణం తో చేసుకుంటామో తెలియకపోయినా హోళీ జరుపుకుంటారు, ఎందుకంటే భంగ్ తాగటానికి పెద్దకారణాలు అవసరం లేదు మేరా భారత్ మహాన్" షఅసలు ఏరాక్షసుడు ఏం చేసి ఏదేవుడితో చంపబడ్డాడో గానీ, పక్కింటి అమ్మాయిలను తడిబట్టల్లో చూసే అవకాశం ఇచ్చినందుకు వారికి నా కృతఙ్ఞతలు" అంటూ నానా రకాల ట్వీట్లు వేశాడు వర్మ. అయితే మళ్ళీ ఇంతకుముందు పడ్డ మొట్టికాయలు గుర్తొచ్చాయో మళ్ళీ ఎందుకు అనవసర రాద్దాంతం అనుకున్నాడో గానీ మళ్ళీ ఆ ట్వీట్లన్నీ తీసేసాడు కానీ అప్పటికే చూడాల్సిన వాళ్ళు చూసేసారు. ఆ స్క్రీన్ష్ట్ట్లతో కొన్ని పంచ్ లుకూడా పడిపోయాయి.

అయితే కొద్ది సేపటికే అన్నీ తీసేసిన వర్మ ఒక్క వివాదరహిత పోస్ట్ ని మాత్రం అలా ఉంచేసాడు. ఈ ఒక్క ట్వీట్ నిజంగా వర్మ ఎలా ఆలోచిస్తాడో వెటకారం వాడకుంటే వర్మ మాటల్లో ఎంత నిజం ఉంటుందో తెలిపేలాగా ఉంది. ''కేవలం ఎప్పుడో వచ్చిన ఒక సమస్యపై గెలిచాం అని మనం హోళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాని ఇప్పుడున్న సమస్యల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు'' అంటూ ఉన్న ఆ ఒక్క ట్వీట్ కి మాత్రం అభిమానులు పాజిటివ్ గా స్పందించారు.