»   » రక్త చరిత్ర -2 ప్లాపయినా రామ్ గోపాల్ వర్మ తో మళ్శీ సూర్య ?

రక్త చరిత్ర -2 ప్లాపయినా రామ్ గోపాల్ వర్మ తో మళ్శీ సూర్య ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ, సూర్య కాంబినేషన్ లో వచ్చిన రక్త చరిత్ర చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ త్వరలోనే రిపీట్ కానుందని సమాచారం. "ది బిజెనెస్ మేన్ " పేరుతో వర్మ నిర్మించనున్న చిత్రంలో సూర్య కమిటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మొదట పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తాడనుకున్నారు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే డైరక్ట్ చేసేటట్లు కనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వర్మ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల రాజు షూటింగ్ ఫినిషింగ్ టచ్ స్ లో ఉన్నారు. ఇక రక్త చరిత్ర చిత్రం గురించి సూర్య మాట్లాడటానికి తమిళ మీడియా వద్ద ఇష్టపడటం లేదు. ఒక్కసారి ప్లాప్ అయినంత మాత్రాన ఆ కాంబినేషన్ రిపీట్ చేయకూడదా అంటున్నాడు. అలాగే సూర్యకి సినిమా కన్నా వర్మ టేకింగ్ నచ్చిందని, తెలుగులో ఎలా ఉన్నా తమిళంలో బాగా వర్కవుట్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాడని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu