twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాట విడుదలతో మరోసారి వార్తల్లోకి వర్మ

    By Srikanya
    |

    ముంబై : ప్రముఖ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ ఏది చేసినా అందులో ఏదో ఒక సంచలనం ఉండేలా చూసుకుంటారు. తాజాగా ఆయన ముంబాయి దాడుల ఆధారంగా రూపొందించిన 'ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11' చిత్రంలోని ఒక పాటను ముంబాయిలోని ఒక కేఫ్‌లో విడుదల చేస్తానని ప్రకటించారు. దాంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆ చిత్రంపై పడింది. ప్రమోషన్ లో ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిందే అని ప్రత్యర్దులు అనే మాటలు నిజమనిపించేలా ఇలా ప్లాన్ చేసారు.

    ఈ విషయమై వర్మ మాట్లాడుతూ...'ఇక్కడి వాళ్ళు ఆ విషాదం నుంచి కోలుకునే విధానం, వాళ్ళ స్ఫూర్తి గురించి చెప్పుకోవాలి. దాడులు జరిగిన మూడోరోజు కేఫ్‌ యజమాని ఫర్జాద్‌ కేఫ్‌ని తెరిచారు. ఆ రోజు కేఫ్‌ అంతా నిండిపోయింది. దాడికి భయపడి పారిపోయిన ఒక కస్టమర్‌ ఆ రోజు తిరిగి వచ్చి, నా డ్రింక్‌ పూర్తి చేయడానికి వచ్చాను అని ఫర్జాద్‌తో చెప్పాడు. ఆ సమయంలో జరిగిన బాధాకర సంఘటనల అనంతరం అతని మాటలు విన్నప్పుడు, ఈ పాట ఇక్కడ విడుదల చేయటమే సరైన శ్రద్ధాంజలి అనిపించింది.' అన్నారు వర్మ.

    ఈ చిత్రం కోసం పలు సన్నివేశాలు ముంబాయిలో ఉగ్రవాదుల దాడులు జరిగిన పలు ప్రాంతాల్లో చిత్రీకరించాలని వర్మ ప్రయత్నించారు. కానీ షూటింగ్‌ నిర్వహించడానికి ఆయనకు అనుమతి లభించలేదు. అయితే లియోపోల్డ్‌ కేఫ్‌ యజమాని ఫెర్జాద్‌ జెహాని మాత్రం ఆయన కేఫ్‌లో జరిగిన సంఘటనను చిత్రీకరించడానికి పూర్తిగా సహకరించారని, అందుకే చిత్రంలో ఉన్న ఒకే ఒక పాటను ఈ కేఫ్‌లో ఫిబ్రవరి, 6న విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

    2008లో జరిగిన దాడులు ఈ కేఫ్‌ నుంచే మొదలయ్యాయని, అందుకే, చిత్రంలో రషిన్‌ కంపోజిషన్‌లో, సుఖ్‌విందర్‌ పాడిన వీడియో పాటను ఈ కేఫ్‌లో విడుదల చేస్తున్నామని వర్మ తెలిపారు. అలాగే ఈ కేఫ్‌ ముంబాయి నగరవాసుల స్ఫూర్తిని వ్యక్తపరుస్తోందని ఆయన అన్నారు.

    26/11 ముంబయ్ మారణహోమం నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ హిందీలో తెరకెక్కిస్తున్న చిత్రం 'ది అటాక్స్ ఆఫ్ 26/11'. ఈ సినిమాను రూపొందించడానికి గల ఉద్దేశ్యమేమిటో రామ్‌గోపాల్‌వర్మ మీడియాకు తెలిపారు. మానవ చరిత్రలో న్యూయార్క్ లో జరిగిన 9/11 తీవ్రవాదుల దాడుల కంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగిన తీరులో 26/11 ముంబయ్ దాడులు వాటికంటే భయంకరమైనవి. నా చిత్రంలో ముంబయ్ దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగాలను తెరకెక్కించబోతున్నాను.

    ఆ ఘటనతో పరోక్షంగా సంబంధమున్న చాలా మంది వ్యక్తులతో లోతైన ఇంటర్వ్యూలు చేశాను. అప్పుడు తెలుసుకున్న కొన్ని విషయాలు నన్ను నిజంగా షాక్‌కు గురిచేశాయి. మనిషి యొక్క క్రూరత్వాన్ని, ధైర్యాన్ని ఇంత దగ్గరగా చూసిన తర్వాత మనుషుల పట్ల నాలో కొత్త దృక్పథం ఏర్పడింది. మానవ ప్రవృత్తిపై మరింత అవగాహన పెరిగింది. అందుకే భారతీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని తీశాను' అన్నారు. మానవ ప్రవృత్తిపై మరింత అవగాహన పెరిగింది. అందుకే భారతీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని తీశాను అన్నారు.

    English summary
    
 Leopold Cafe was one of the key targets of the brutal 26/11 Mumbai attacks. And five years down the line, filmmaker Ram Gopal Varma has decided to release the first song of his new film The Attacks on 26/11 at the same cafe, Feb 6.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X