»   » నాకిష్టమైన హీరో నాలోకనబడుతున్నాడంటే సంతోషమే..!

నాకిష్టమైన హీరో నాలోకనబడుతున్నాడంటే సంతోషమే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల రిలీజ్ అయిన 'కందిరీగ' సినిమా సక్సెస్ బాటలో పయనిస్తూ, హీరో రామ్ కి మంచి పేరు తెస్తోంది. అయితే, ఇందులో రామ్ అభినయం చూస్తే... అందరికీ రవితేజ గుర్తుకొస్తున్నాడట. అంటే, మనవాడు రవితేజా స్టయిల్ని అనుకరిస్తున్నాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే, రామ్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. 'నేనెవ్వర్నీ అనుకరించడం లేదు. అయినా తమకిష్టమైన హీరో నాలో కనపడుతున్నాడంటే దానిని కాంప్లిమెంటుగానే తీసుకుంటాను తప్ప, కంప్లైంట్ గా మాత్రం తీసుకోను'అంటున్నాడు రామ్ నవ్వుతూ. ప్రేక్షకులు నన్ను వారికి నచ్చిన హీరోలతో పోల్చుకుంటున్నారు అని తెలిపాడు.

'దడ, కందిరీగ చిత్రాలు ఒకే సమయంలో విడుదలవడం వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డరా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ...'ఇతర హీరోల సినిమాల గురించి నేనెప్పుడూ పట్టించుకోను. అయితే రెండు పెద్ద సినిమాల్ని ఒకే సమయంలో విడుదల చేసే ముందు నిర్మాతలు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని నా అభివూపాయం" అని చెప్పారు. ''కందిరీగ" చిత్రం ద్వారా సంతోష్‌శ్రీనివాస్ రూపంలో పరిక్షిశమకు మంచి కమర్షియల్ దర్శకుడు దొరికాడని ప్రశంసించారు. వరుసగా మాస్ సినిమాలు చేశాను..తదుపరి రెండు ప్రేమ కథా చిత్రాలు చేస్తున్నానని పేర్కొన్నాడు.

English summary
When one of the media spokespersons asked that his performance appeared like he is imitating Ravi Teja, he quickly said, “I did not imitate anyone. Yet I take it as a compliment when someone is seeing their hero in me.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu