»   » రామ్ 'కందిరీగ' స్టోరీలైన్ ఏంటి?

రామ్ 'కందిరీగ' స్టోరీలైన్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్, హన్సిక కాంబినేషన్ లో తెరకెక్కతున్న చిత్రం 'కందిరీగ'. సంతోష్‌ శ్రీనివాస్‌ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్..శీను గా కనిపిస్తాడు. పెద్దగా చదువు, సంధ్యాలేని శీను అల్లరి చిల్లరిగా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు.'నా పేరు శీను... నాక్కొంచెం టెంపరెక్కువ' అని చెప్పుకోవటం ఇష్టపడుతూంటాడు. ఎలాంటి విషయంలోనైనా మొండిగా దూసుకుపోయే అతనికి ప్రేమ మీద నమ్మకం ఉండదు. అలాంటివాడు అనుకోని పరిస్ధితుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి కథ మలుపుతిరుగుతుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగస్టు మొదటివారంలో సినిమా విడుదల చేయాలని నిర్ణంయించారు. ఈ చిత్రంలో అక్ష మరో హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రంపై రామ్ మంచి అంచనాలే పెట్టుకున్నాడు. రామ్ మాట్లాడుతూ - 'రామరామ కృష్ణకృష్ణ' తర్వాత విరామం తీసుకుని 'కందిరీగ'తో వస్తున్నాను. తప్పకుండా హిట్ సినిమా అవుతుంది. 'గణేష్' తర్వాత కొత్త దర్శకులతో చేయకూడదనుకున్నా. కానీ శ్రీనివాస్ మంచి కథ చెప్పి మెప్పించాడు అంటున్నారు.

English summary
Ram’s latest movie 'Kandireega'. Hansika is paired up with Ram for the second time. Santosh Srinivas is making his debut as a director with Kandireega. Bellamkonda Suresh is the producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu