»   » ఫ్లాప్ ఇచ్చినా మరో చాన్స్ ఇస్తున్నాడు: కరుణాకరణ్ ఈసారేం చేస్తాడో

ఫ్లాప్ ఇచ్చినా మరో చాన్స్ ఇస్తున్నాడు: కరుణాకరణ్ ఈసారేం చేస్తాడో

Posted By:
Subscribe to Filmibeat Telugu

"తొలి ప్రేమ" దాదాపు పదిహేనేళ్ళ క్రితం యూత్ హృదయాలను కొల్లగొట్టిన అందమైన ప్రేమ కథ ని తెరకెక్కించిన తీరూ, ఆ సినిమా సాధించిన విజయం కళ్లముందు కదలాడతాయి. ఒక సున్నితమైన సబ్జెక్ట్ ని అద్బుతంగా తెరకెక్కించి యూత్ మనసుని దోచుకున్నాడు కరుణాకరణ్.

డార్లింగ్,ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలు కూడా అద్బుతమైన పేరు తెచ్చుకున్నాయి.. అలాంటి కరుణాకరన్ దర్శకత్వంలో మళ్లీ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందనుంది .. అదీ యంగ్ హీరో రామ్ హీరోగా.

Ram, Karunakaran to come together again

గతంలో రామ్ హీరోగా ఆయన "ఎందుకంటే ప్రేమంట" సినిమా చేశాడు. అయితే అది రామ్ అభిమానులను నిరాశపరిచింది. "నేను శైలజ" చిత్ర విజయం తో ఫుల్ జోష్ మీద ఉన్న రామ్ కు కరుణాకరన్ మరోసారి ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథ వినిపించాడట.కథ బాగా నచ్చడం తో సినిమా చేయడానికి రామ్ ఒకే చెప్పాడని సమాచారం..

Ram, Karunakaran to come together again

ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మించాబోతున్నాడు ప్రస్తుతం రామ్ .. "కందిరీగ" దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కరుణాకరన్ తో చేయనున్నాడు. రామ్ తనకి హిట్ ఇచ్చిన దర్శకుడికే కాదు .. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి కూడా ఛాన్స్ ఇవ్వడం విశేషం.

English summary
Ram and director Karunakaran are likely to team up for the second time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu