»   » 'సెకండ్ హ్యాండ్' డైరక్టర్ తో ...రామ్ కొత్త సినిమా ఈ రోజే

'సెకండ్ హ్యాండ్' డైరక్టర్ తో ...రామ్ కొత్త సినిమా ఈ రోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రామ్ వరస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ‘పండగ చేస్కో', ‘శివమ్' చిత్రాలు చేస్తున్న రామ్ మరో సినిమా ఈ రోజు ఓపినింగ్ అయ్యింది. ఈ చిత్రాన్ని ‘స్రవంతి' రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 1) తమిళనాడులోని పొల్చాచ్చిలో ప్రారంభమైంది.'సెకండ్ హ్యాండ్' డైరక్టర్ కిషోర్ తిరుమల డైరక్ట్ చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - "'రఘువరన్ బీ టెక్' చిత్రానికి మంచి సంభాషణలు అందించిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 15 వరకు పొల్లాచ్చిలో షూటింగ్ చేస్తాం. ఈ షెడ్యూల్ లో ఒక పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. ఇది మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. రామ్ కారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది" అన్నారు.

ఈ చిత్రానికి హరికథ అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం దర్శకుడు సెకండ్ హ్యాండ్ అనే చిత్రాన్ని డైరక్ట్ చేసారు. సత్యరాజ్, ప్రదీప్ రావత్, నరేశ్, విజయ్ కుమార్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, ఫైట్స్: హరి దినేష్.

రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో' చిత్రం గురించి...

ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో' విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం మే 14 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. తన గత చిత్రాలైన ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పండగచేస్కో ద్వారా మనముందుకు వస్తున్నాడు రామ్.

ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర కీలకం కానుంది. బ్రహ్మానందం...ఈ సారి వీకెండ్ వెంకట్రావ్ గా రామ్ తాజా చిత్రం పండుగ చేస్కో లో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కామెడీతో ఇరగ తీస్తుందని చెప్తున్నారు. గతంలో రామ్, బ్రహ్మానందంల కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రతో మరో సారి తన ట్రేడ్ మార్క్ ని చూపించి సినిమాకు ప్లస్ అవనున్నాడని తెలుస్తోంది. 

Ram launches yet another film

ఈ చిత్రంలో రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
Ram's next film which is tentatively titled Harikatha was launched formally today. This movie will be directed by Kishore Tirumala,who penned dialogues for Raghuvaran Btech. Devi Sri Prasad will score tunes for this flick. Sameer Reddy is the cinematographer. This movie will be produced under Sri Sravanthi Movies banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu