మీసం తో కన్ఫూజన్ కామెడీ : రామ్ 'మసాలా'
హైదరాబాద్: వెంకటేష్, రామ్ కలిసి నటించిన సినిమా 'మసాలా'. విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు సమర్పిస్తున్నారు. స్రవంతి రవికిశోర్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించారు. హిందీలో ఘన విజయం సాధించిన 'బోల్ బచ్చన్' ఆధారంగా తెరకెక్కింది. అంజలి, షాజన్ పదంసీ కథానాయికలుగా నటించారు. ఫక్తు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఇది. ఈ చిత్రంలో మీసం చుట్టు కథ తిరుగుతుంది. రామ్ ...మీసం తీసేసి ఒకసారి..మరోసారి మీసంతో కనపడి కన్ఫూజ్ చేస్తూ వెంకటేష్ తో ఆడుకుంటూంటాడు. ఆ సీన్స్ నవ్విస్తాయంటున్నారు.
కథల్లోనే కాదు... తెరపై కనిపించే విధానంలోనూ మార్పు కోరుకొనే నటుడు వెంకటేష్. ఖాళీగా ఉండకూడదనో లేదంటే సంఖ్య పెంచుకోవాలనో ఆయన సినిమాలు ఒప్పుకోరు. ప్రేక్షకులకు సంపూర్ణమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగుతుంటారు. అందుకోసం తన ఇమేజ్‌ని సైతం మరిచిపోతుంటారు. ఇతర కథానాయకులతో కలిసి తెరను పంచుకొంటుంటారు. అందుకే సినిమాలో వెంకీ ఉన్నాడంటే వినోదాలు గ్యారెంటీ అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంటారు ప్రేక్షకులు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం మహేష్‌బాబుతో జతకట్టిన వెంకటేష్... ఇప్పుడు రామ్‌తో కలిసి సందడి చేయబోతున్నారు.
వెంకటేష్, రామ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'మసాలా'. అంజలి, షాజన్ పదమ్‌సీ కథానాయికలు. కె.విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. చిత్రీకరణ పూర్తయింది. దసరాకి పాటల్ని విడుదల చేస్తారు. అక్టోబరు నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
అందులో వెంకటేష్, రామ్ కనిపిస్తున్న విధానం కొత్తగా ఉంది. వెంకటేష్ పొడవాటి మీసాలతో కనిపిస్తుండగా... రామ్ ఇదివరకంటే భిన్నంగా గుబురు మీసాలతో కనిపిస్తున్నారు. హిందీలో విజయవంతమైన 'బోల్‌బచ్చన్' ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అందులో అజయ్‌దేవగణ్ పోషించిన పాత్రలో... ఇక్కడ వెంకటేష్ కనిపిస్తారు. అభిషేక్ బచ్చన్ పోషించిన పాత్రలో రామ్ నటించారు. రామ్ పాత్ర రెండు కోణాల్లో సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు.
స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ... "అన్ని రకాల అంశాల మేళవింపుగా సినిమాను తెరకెక్కించాం. థమన్ మంచి సంగీతాన్ని అందించారు. పక్కా మాస్ మసాలా అంశాలను ఆశించవచ్చు. సంభాషణలు అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రతి ఫ్రేమ్ కన్నుల పండువగా ఉంటుంది. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications












