»   » పండగ చేస్కో....హీరోతో చంద్రబాబు ఇలా (ఫోటో)

పండగ చేస్కో....హీరోతో చంద్రబాబు ఇలా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'పండగ చేస్కో' హీరో రామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న నారా చంద్రబాబు నాయుడిని కలిసి అభినందలు తెలిపారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా చంద్రబాబు రామ్‌తో అన్నట్లు తెలుస్తోంది.

రామ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'పండగ చేస్కో' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ కొట్టగా...ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేసారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

Ram meets Chandrababu Naidu

ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఒక మంచి టైటిల్, కథతో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వెలిగొండ శ్రీనివాస్ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. కోన వెంకట్, అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించారు. బలుపు తర్వాత మంచి టెక్నీషియన్స్‌తో కలిసి చేస్తున్న ఈచిత్రం రామ్ అభిమానులకు నిజంగా పండగ అవుతుంది అన్నారు.

రామ్ ఎనర్జీకి తగిన విధంగా ఈ సినిమా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర కూడా చాలా ఎనర్జీతో ఉంటుంది. బ్రహ్మానందంగారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. థమన్, విల్సన్, గౌతం రాజు, రామ్ లక్ష్మణ్ లాంటి వారు పని చేస్తున్నారని తెలిపారు.

English summary
Tollywood actor Ram met Chandrababu Naidu today at his residence. Ram congratulated him on being elected as CM of Andhrapradesh state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu