అల.. వైకుంఠపురములో: 'సిత్తరాల సిరపడు'పై టీడీపీ ఎంపీ కామెంట్స్

'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'సిత్తరాల సిరపడు..' సాంగ్‌ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదల వరకు ఈ పాటను రహస్యంగా ఉంచిన చిత్రయూనిట్ విడుదల తర్వాత పాట రిలీజ్ చేసి ఆకట్టుకుంది. ఈ పాటకు పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది.

ఒడిశాలోని జయపూర్‌కి చెందిన ఎల్ఐసీ అధికారి ఈ పాటను విజయ్ ‌కుమార్ రాశాడు. ప్రస్తుతం మచిలీపట్నంలో వర్క్ చేస్తున్న విజయ్ కుమార్ అంతకు ముందు ఏపీలోని శ్రీకాకుళంలో కూడా వర్క్ చేశారు. ఆయనకు జానపద గేయాలంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం యాసలో ఈ గేయం రచించారు. అదే పాటను 'అల వైకుంఠపురములో' సినిమా కోసం తీసుకున్నారు.

Ram Mohan Naidu Kinjarapu comments on Sittharala Sirapadu

తాజాగా ఈ పాటపై టీడీపీ ఎంపీ రామ్‌మోహన్ నాయుడు రియాక్ట్ అయ్యారు. తమ ప్రాంత వాడుక భాషలో రాసిన 'సిత్తరాల సిరపడు' విని ఎంతో ఆనందించానని తెలిపారు. ''అల.. వైకుంఠపురములో శ్రీకాకుళం జానపద గీతాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని మా వాడుక భాషలో రాసిన 'సిత్తరాల సిరపడు' విని చాలా ఆనందించాను. ఈ జిల్లా సంస్కృతి సాహిత్యం తెలుగువాళ్ళకి చెప్పిన దర్శకులు, రచయిత, గేయకర్తకు కృతఙ్ఞతలు. అలాగే అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు. శ్రీకాకుళం యాసలో ఎంతో అందంగా పాడిన సూరన్నకు, అలాగే సాకేత్‌కు ధన్యవాదాలు'' అని రామ్‌మోహన్ నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X