For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి లాంచ్ చేసిన 'ఒంగోలు గిత్త' ఆడియో (ఫోటోలతో..)

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఒంగోలు గిత్త'. ఈ చిత్రం ఆడియో నిన్న(బుధవారం)హైదరాద్ లో విడుదలైంది. ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్ట్మైంట్ కలిసిన పాత్రలో రామ్ కనిపించనున్నారు. ఈ చిత్రంపై భాస్కర్ చాలా నమ్మకంగా ఉన్నారు. కృతికర్బంద హీరోయిన్ గా చేసే ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.

  ఆయన ఈ చిత్రం గురించి చెప్తూ....ఒంగోలు పేరు చెప్పగానే గిత్తలు గుర్తొస్తాయి. ఆ కుర్రాడిదీ ఒంగోలే. అతని ధైర్యం మిగతావారికి మొండితనంలా కనిపిస్తుంది. అతని దూకుడు... నిర్లక్ష్యం అనుకొంటారు. ఇవన్నీ అతని ఆయుధాలు. ఇంతకీ వీటిని ఎవరిపై ప్రయోగించాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు బొమ్మరిల్లు భాస్కర్‌.

  బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటల్ని రాజమౌళి ఆవిష్కరించారు.

  రాజమౌళి మాట్లాడుతూ ''ఈ చిత్ర నిర్మాతలతో నేను 'ఛత్రపతి' చేశాను. అంత పెద్ద చిత్రానికి అప్పట్లో వాళ్లు ఎంతో సహకారం అందించారు. 'ఒంగోలు గిత్త' కోసం భాస్కర్‌ కసితో పనిచేశాడని అర్థమవుతోంది. 'విక్రమార్కుడు' సినిమాలో మిరపకాయలు నేపథ్యంతో వచ్చే ఒక చిన్న సన్నివేశాన్ని తీయలేక చాలా ఇబ్బందిపడ్డాం. మూడు నాలుగు రోజులు కంటే ఎక్కువ పనిచేయలేకపోయాం. కానీ ఈ సినిమా మొత్తం మిర్చి యార్డ్‌లోనే చిత్రీకరణ చేయడం చాలా గొప్ప విషయం. నటీనటులను కూడా అభినందించాలి. రామ్‌ మిరపకాయ్‌లాంటి వాడు కావడంతో ఈ సినిమా చేసుండొచ్చు. ఆరు నెలల క్రితం నిర్మాత ఈ టైటిల్‌ గురించి చెప్పారు. రామ్‌కి తగినట్టు ఉందని అప్పుడే అనిపించింది. ఇందులో ఓ జానపద గీతం ఉంది. అలాంటి పాటను పెట్టినందుకు భాస్కర్‌ను అభినందించాలి''అన్నారు.

  ''ఒంగోలు గిత్త' చిత్రం ప్రారంభానికి ముందు నేను భాస్కర్‌ లాంటి ఓ క్లాస్‌ దర్శకుడితో పనిచేయబోతున్నాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను చేసిన వూర మాస్‌ సినిమా ఇది అని. ఈ చిత్రం కోసం నేను ప్రాణం పెట్టి పని చేశాను''అన్నారు రామ్‌.

  దర్శకుడు భాస్కర్‌ మాట్లాడుతూ ''ఒంగోలు గిత్త ఏమిటి? భాస్కర్‌ ఏమిటి? అనుకుంటుంటారు చాలామంది. నా తదుపరి చిత్రం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అందరూ ఆస్వాదించేలా ఓ కథ రాసుకోవాలి అనిపించింది. అదే ఈ చిత్రం. ఈ సినిమాకు పేరేంటి అనుకున్నప్పుడు ఒంగోలు గిత్తలా హుషారుగా ఉంటే బాగుంటుంది అన్నాను. చివరకు అదే ఈ చిత్రానికి పేరయ్యింది. ఈ కథకు సరిపోయే కథానాయకుడు ఎవరు అనుకుంటుంటే రామ్‌ గుర్తొచ్చారు. నిజంగా గిత్తలానే హుషారుగా నటించారు. ఇప్పటివరకూ చూసిన రామ్‌ ఒక ఎత్తు అయితే ఇందులో మరో ఎత్తు. ఒక్కో చిత్రానికి ఒక్కో జ్ఞాపకం ఉంటుంది. ఈ సినిమాకు ఆ జ్ఞాపకం జానపద గీతం. అందరికీ సంతృప్తినిచ్చే చిత్రమవుతుంది''అన్నారు.

  ''నేను చాలా అదృష్టవంతురాల్ని. ఇలాంటి పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది. 'బొమ్మరిల్లు' చూశాను. భాస్కర్‌ లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం ఎప్పుడొస్తుందా అనుకునేదాన్ని. చివరకు ఆయన్నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. రామ్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది'' అన్నారు కృతి కర్బందా.

  రామ్‌ మాట్లాడుతూ ''మార్కెట్‌ యార్డు నేపథ్యంగా సాగే పాత్ర నాది. ఇందులో సంభాషణలు చాలా బాగుంటాయి. జీవీ ప్రకాష్‌, మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మణిశర్మపైన హత్యాయత్నం కేసు పెట్టాలి అనుకున్నాను. ఆయన బాణీలు సమకూర్చిన ఓ మాస్‌ గీతానికి నృత్యాలు చేయలేక అంతగా కష్టపడ్డాను. వనమాలి, భాస్కరభట్ల చక్కటి సాహిత్యం అందించారు. కృతి కర్బందాతో పనిచేయడం చక్కటి అనుభవం'' అని చెప్పారు

  ఈ కార్యక్రమంలో స్రవంతి రవికిషోర్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, భోగవల్లి బాపినీడు, అలీ, కోనవెంకట్‌, భాస్కర భట్ల, వనమాలి తదితరులు పాల్గొన్నారు.

  ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి

  నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ... ''భాస్కర్‌ సినిమాలంటే కుటుంబ ప్రేక్షకులకు కావల్సిన అంశాలుంటాయి. రామ్‌ శైలి యువతరానికి నచ్చుతుంది. వెరసి... అన్ని వర్గాలకీ నచ్చేలా ఉంటందీ సినిమా. మార్కెట్‌ యార్డు నేపథ్యంలో నడుస్తుంది. '' అని తెలిపారు.

  English summary
  Ram and Kriti starrer Ongole Githa had its music launch at the sets erected for filming of one of the movie’s songs at Annapurna Studios in Hyderabad on Wednesday night (Jan 16th). The film is being directed by 'Bommarillu' Bhaskar and produced by BVSN Prasad. It has music by G V Prakash, and a song is composed by Manisharma apart from scoring background score. Vanamali penned four songs while Bhaskarabhatla wrote a song.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X