Just In
- 33 min ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 1 hr ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
- 2 hrs ago
యుద్దమే ధర్మం కానప్పుడు ధర్మయుద్దాలెక్కడివి.. ‘అర్దశతాబ్దం’ టీజర్ రచ్చ
- 2 hrs ago
అరియానా బర్త్ డే.. స్పెషల్ సెలెబ్రేషన్స్‌లో అవినాష్.. పిక్స్ వైరల్
Don't Miss!
- News
మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే
- Finance
క్యాండిడ్ న్యూస్ ... రుచిని ఆస్వాదిస్తూ క్యాండీలు తినే ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్ర
- Sports
శుభ్‌మన్ గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది: గంభీర్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయ్.. శ్రేయాస్ మీడియాపై రామ్ కామెంట్స్
సోషల్ మీడియాలో చిన్న తప్పులే ఒక్కోసారి పెద్ద పెద్దగా అవుతుంటాయి. అలా రామ్ హీరోగా వస్తోన్న సినిమా RED ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ చిన్న తప్పు దొరికింది. అయితే అది చిన్న తప్పేమీ కాదు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి మొదటి టికెట్ అని చెప్పి ఇచ్చే దాంట్లోనూ పెద్ద తప్పు జరగడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక నిన్న రాత్రి నుంచి ఈవెంట్‌ను జరిపించిన శ్రేయాస్, నిర్మాతలు, చిత్రయూనిట్‌పై అందరూ ఫైర్ అవుతూనే ఉన్నారు.
రెడ్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ..రామ్ హంగామా చూడండి (ఫోటోలు)

RED ఈవెంట్..
రామ్ RED ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. మొదటి నుంచి చివరకు బాగానే ఆర్గనైజ్ చేశారు. హీరో హీరోయిన్లు ముఖ్య అతిథిగా వచ్చిన త్రివిక్రమ్ అందరూ మాట్లాడి ఎమోషనల్‌గా టచ్ చేశారు. డైరెక్టర్ మాట్లాడింది కొంచమే అయినా కూడా చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోయాడు.

త్రివిక్రమ్ స్పీచ్ హైలెట్..
RED ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త్రివిక్రమ్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చేశాడు. స్రవంతి రవికిషోర్‌తో ఉన్న అనుబంధం, బంధం, ఇన్నేళ్ల ప్రయాణానికి గుర్తుగా బాధ్యతగా వచ్చాడు. నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ రవికిషోర్‌తో ఉన్న బంధాన్ని అందరికీ చెప్పాడు. చివరకు రవికిషోర్ కాళ్లకు మొక్కి త్రివిక్రమ్ తన బంధాన్ని చాటుకున్నాడు.

బిగ్ టికెట్..
ఈ మధ్య చీఫ్ గెస్ట్‌లుగా వచ్చిన వారికి బిగ్ టికెట్ పేరిట మొదటి టికెట్‌ను ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్‌కు కూడా ఓ బిగ్ టికెట్ ఇచ్చారు. సాధారణంగా అది RED టికెట్ అని అనుకుంటారు. కానీ అది క్రాక్ సినిమా టికెట్. చూసుకోకుండా జరిగిన ఈ పొరపాటు వల్ల ఈవెంట్‌కు ఇది మచ్చలా మిగిలింది.

ట్రోలింగ్‌తో హల్చల్..
ఇక RED సినిమా ఈవెంట్‌లో క్రాక్ సినిమా టికెట్ ఇచ్చారు.. క్రాక్ సినిమాను ప్రమోట్ చేశారంటూ ఎగతాళి చేశారు. శ్రేయాస్ మీడియాను మొత్తంగా ఏకిపారేశారు. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతుండటం రామ్ చెవిలో పడ్డట్టుంది. జరిగిన తప్పుపై రామ్ హుందాగా స్పందించాడు.

అప్పుడప్పుడు..
రామ్ RED సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. వచ్చిన త్రివిక్రమ్, తన ఫ్యాన్స్, సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్ చెప్పాడు. ఇక చివరకు శ్రేయాస్ మీడియా వారి తప్పు గురించి మాట్లాడుతూ.. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయ్.. అయినా ఏం పర్లేదు.. ఈవెంట్‌ను బాగా నిర్వహించారు.. అని రామ్ ట్వీట్ చేశాడు.