ఆ డైరెక్టర్లకు సీక్రెట్ పార్టీ ఇచ్చిన హీరో రామ్.. సినిమాలు చేయకున్నా ఇద్దరికి ఆహ్వానం
కెరీర్ ఆరంభంలో పలు విజయాలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. మధ్యలో కొన్ని పరాజయాల కారణంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ నేపథ్ంయలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడతను. అంతేకాదు, ఈ సినిమాతో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మార్పులు చేసుకున్నాడు. దీంతో సక్సెస్ అయ్యాడు.
ఈ ఉత్సాహంతోనే ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' అనే సినిమా చేస్తున్నాడు రామ్ పోతినేని. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, ఇంతలో కరోనా వైరస్ ప్రభావంతో థియేటర్లు మూతపడడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడిపోయింది. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. కానీ, దీన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని రామ్ పట్టుదలతో ఉన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉండగా, 'రెడ్' తర్వాత తాను నటించబోయే సినిమాను ఇప్పటి వరకూ ప్రకటించలేదు రామ్. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని కొందరు దర్శకులకు అతడు సీక్రెట్ పార్టీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. దీనికి రామ్‌తో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'రెడ్' వంటి చిత్రాలు చేసిన కిశోర్ తిరుమల.. 'కందిరీగ' చేసిన సంతోష్ శ్రీనివాస్.. 'పండగ చేస్కో' తీసిన గోపీచంద్ మలినేని హాజరయ్యారు. వీరితో పాటు అతడితో ఒక్క సినిమాను కూడా తెరకెక్కించని అనిల్ రావిపూడి, వెంకీ కుడుమల కూడా వచ్చారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











