For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయిలకు కమిట్ కాను.. అప్పుడు బ్రేకప్ జరిగిన ఫీలింగ్ కలిగింది .. రామ్

  By Rajababu
  |

  టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ అనే ట్యాగ్ పక్కగా హీరో రామ్‌కు పక్కగా సూట్ అవుతుంది. ఏ పాత్రలోనైనా హైపర్ ఎనర్జీతో కనిపిస్తాడు. అలాంటి హైపర్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. ఈ చిత్రం అక్టోబర్ 27న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో రామ్ తెలుగు ఫిల్మ్‌బీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కెరీర్, సినిమా, వ్యక్తిగత విషయాలు గురించి రామ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  మూడ దశల్లో కథ..

  మూడ దశల్లో కథ..

  ఉన్నది ఒకటే జిందగీ లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంగా కథ సాగుతుంది. అయితే నేను శైలజ మాదిరిగా ఉండదు. ఇది కొత్త కథ. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అభిరామ్. అభిరామ్ జీవితంలోని బాల్యం, కాలేజీ లైఫ్, కాలేజ్ లైఫ్ అనంతరం చోటుచేసుకున్న సంఘటనలే ఈ చిత్ర కథ.

  కథ విన్నప్పుడు ఫ్రెండ్స్ గుర్తొచ్చారు.

  కథ విన్నప్పుడు ఫ్రెండ్స్ గుర్తొచ్చారు.

  దర్శకుడు కిశోర్ తిరుమల కథను చెప్పేటప్పుడే నా బాల్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు గుర్తొచ్చారు. సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్‌ను కల్పిస్తాయి. నా జీవితంలో ఎదురైన సంఘటనలు షేర్ చేసుకొన్నప్పుడు వాటిని దర్శకుడు సీన్లుగా మలిచాడు.

  అభిరామ్ రోల్ రోల్ మోడల్

  అభిరామ్ రోల్ రోల్ మోడల్

  జీవితంలో ఎవరైనా రోల్ మోడల్‌గా ఉండాలనేంతగా అభిరామ్ పాత్రను డిజైన్ చేశారు. అభిరామ్ పాత్రను నేను కూడా రోల్ మోడల్ అనేంతగా ఇష్టపడ్డాను. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. లైఫ్ అనేది చాలా సింపుల్. కానీ మనమే దానిని కాంప్లికేట్ చేసుకొంటాం.

  రాక్ బ్యాండ్ లీడర్‌గా

  రాక్ బ్యాండ్ లీడర్‌గా

  ఉన్నది ఒకటే జిందగీ సినిమా కథ వినక ముందే నేను జట్టు, గడ్డం బాగా పెంచాను. కథ విన్న తర్వాత పాత్రకు అనుగుణంగా గెటప్ మార్చాం. ఈ చిత్రంలో కాలేజ్‌లో నేను రాక్ బ్యాండ్ నడుపుతుంటాను. రాక్ బ్యాండ్ నడిపే వాళ్లు సహజంగా గడ్డం, జట్టుతో కనిపిస్తుంటారు. అందేకు కొత్త గెటప్‌లో కనిపించాలని డిసైడ్ అయ్యాను.

  రాజా ది గ్రేట్ కథను..

  రాజా ది గ్రేట్ కథను..

  ముందుగా అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ చిత్ర కథ నాకు చెప్పారు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. నేను ఆ కథను రిజెక్ట్ చేశాను అనే వార్త వాస్తవం కాదు. అయితే ఒకసారి కథ ఒప్పుకోకపోతే దాని గురించి ఆలోచించను. చాలా ఆలోచించిన తర్వాతే నేను నిర్ణయం తీసుకొంటాను.

  బెస్ట్ ఫ్రెండ్‌కు, లవర్‌కు తేడా

  బెస్ట్ ఫ్రెండ్‌కు, లవర్‌కు తేడా

  బెస్ట్ ఫ్రెండ్, లవర్‌కు తేడా ఏమిటంటే.. ట్రైలర్ చెప్పినట్టుగానే.. మన పక్కన ఒకళ్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్. ఒక అమ్మాయి మన పక్కన లేకపోతే జీవితం బాగుండదు అనిపిస్తే అది లవర్. అబ్బాయిలకు మనం మిస్ యూ అని మెసేజ్ పెట్టం. అమ్మాయిలకే మిస్ యూ అని పెడుతుంటాం.

  అమ్మాయిలకు కమిట్ కాను..

  అమ్మాయిలకు కమిట్ కాను..

  హేవీ సబ్జెక్ట్‌లను లేదా ప్రత్యేకమైన సినిమాల్లోనే నటించాలనే ఆలోచన నాకు ఉండదు. ఆ సమయానికి కథ నచ్చితే ఓకే చెబుతాను. నేను శైలజ, పండుగ చేస్కో, శివ చిత్రాల కథలు ఒకేసారి విన్నాను. విన్నవెంటనే కథను ఒకే చేశాను. ఒక్క జోనర్‌కే పరిమితం కాను. సాధారణంగా అమ్మాయిల వద్ద, మీడియా వద్ద కమిట్ అసలే కాను. సినిమా చూడటానికి వెళ్లినట్టే వెళ్లి కథ వింటాను.

  మల్టీస్టారర్ చిత్రాలకు రెడీ

  మల్టీస్టారర్ చిత్రాలకు రెడీ

  మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. సరైన స్క్రిప్ట్ వస్తే నేను నటించడానికి రెడీగా ఉంటాను. గతంలో వెంకటేష్‌తో కలిసి నటించాను. కథలు దొరికితే నేను ఎప్పుడూ మల్టీ స్టారర్ చిత్రాలకు రెడీగానే ఉంటాను.

  బ్రేకప్ జరిగినంత పనైంది..

  బ్రేకప్ జరిగినంత పనైంది..

  నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనే విషయాన్ని విశ్లేషిస్తాం. ఆ షాక్ నుంచి బయట పడటానికి ఎన్ని రోజుల పడుతుందో చెప్పలేం. జగడం సినిమా విషయంలో అదే జరిగింది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. లవ్ బ్రేకప్ జరిగినంత ఫీలింగ్ కలిగింది.

  English summary
  Ram Pothineni's new movie Vunnadi Okate Zindagi slated to release on 27th October. The film has got censor clearance with U certificate. Directed by Kishore Tirumala, the romantic drama ‘Vunnadhi Okate Zindagi’ has Ram, Lavanya Tripathi and Anupama Parameshwaran in the lead roles. In this occassion, Ram speaks to Telugu.filmibeat.com exclusively..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X