twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ జగన్ గారు.. ‘స్వర్ణ ప్యాలెస్’లో పెద్ద కుట్ర.. హీరో రామ్ వరుస ట్వీట్లు వైరల్

    |

    విజయవాడ హోటళ్లలో నిర్వహిస్తున్న కోవిడ్ క్వారంటైన్ ఫెసిలిటీస్‌ల నిర్వహణ విషయంలో ఏపీ అధికారులు నిర్లక్ష్యం పరాకాష్టకు ప్రతిరూపంగా నిలిచిందనే విషయం అనేక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో అగ్నిమాపక అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఎలాంటి అనుమతులు, నిరంభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) లేకుండానే కోవిడ్ సెంటర్లకు అనుమతి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ కుటుంబం నిర్వహించే రమేష్ హాస్పిటల్‌పై బురద జల్లే విధంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హీరో రామ్ పోతినేని ట్విట్టర్‌లో స్పందించారు. ఇక ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ చేసిన వరుస ట్వీట్లు వైరల్‌గా మారాయి. ఆ ట్వీట్ల వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu
    పెద్ద కుట్ర జరుగుతున్నది

    పెద్ద కుట్ర జరుగుతున్నది

    స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో పెద్ద కుట్ర జరుగుతున్నది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ గారు.. మీ కింద పనిచేసే వారే మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్టకి, మీ మీద మేము పెట్టుకొన్న నమ్మకానికి నష్టం వాటిల్లుతున్నది. అలాంటి దుష్ప్రచారం చేసే వారిపై ఓ కన్నేస్తారని ఆశిస్తున్నాం అని రామ్ పోతినేని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    అగ్ని ప్రమాదాన్ని పక్కన పెట్టి.. ఫీజులపై రాద్దాంతం

    అగ్ని ప్రమాదాన్ని పక్కన పెట్టి.. ఫీజులపై రాద్దాంతం

    రామ్ చేసిన మరో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఫైర్+ఫీజు = ఫూల్స్ అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అగ్ని ప్రమాదంలో జరిగిన లొసుగులు బయటకు వస్తున్నాయనే విషయాన్ని గ్రహించి.. కొంత మంది హాస్పిటల్ వసూలు చేసిన ఫీజు గురించి టార్గెట్ చేస్తున్నారు. హాస్పిటల్‌కు సంబంధించిన విషయంలో మేనేజ్‌మెంట్ బాధ్యతను నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలేస్ డైరెక్ట్‌గా బిల్లింగ్ చేసింది అంటూ మరో హీరో రామ్ మరో ట్వీట్ చేశారు.

    ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌లోనే కోవిడ్ హాస్పిటల్

    ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌లోనే కోవిడ్ హాస్పిటల్

    స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం కోవిడ్ సెంటర్ నిర్వహించకముందే.. అక్కడ ప్రభుత్వమే క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరినీ నిందించే వాళ్లు అని హీరో రామ్ ప్రశ్న వేశారు. అగ్ని ప్రమాదం విషయంలో తమను తప్పు పట్టే ప్రసక్తి లేదనే కోణంలో రామ్ తమ కుటుంబం తరఫున వాదనలు గట్టిగానే వినిపించారనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

    రామ్ పోతినేని ఎదురుదాడితో..

    రామ్ పోతినేని ఎదురుదాడితో..

    ఇక సినిమాలు తప్ప కుటుంబ బిజినెస్ వ్యవహారాల్లోకి ఎన్నడూ తలదూర్చని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇలా ట్విట్టర్‌లో ఎదురుదాడిని చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమ కుటుంబం, ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ రామ్ ట్వీట్ల వర్షం కురిపించడం రాజకీయ వర్గాల్లో, వ్యాపార వర్గాల్లోనే సంచలనంగా మారింది. ఆవేదనతో రామ్ పోతినేని చేసిన ట్వీట్లపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తూ వేచి చూడాల్సిందే.

    English summary
    Ram Pothineni serious over Swarna Palace fire accident. He wrote serial tweets that, I doubt there’s a HUGE CONSPIRACY to show the CM of AP in bad light.I request ysjagan garu to look into it as a few people under him might be doing this without his knowledge.This is causing huge damage to his reputation & Honest approach,amongst all of us!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X