»   »  బాక్సింగ్ కోచ్‌ని ఆశ్చర్య పరచిన రామ్

బాక్సింగ్ కోచ్‌ని ఆశ్చర్య పరచిన రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ డాన్సులు చేయడంలోనూ, ఫైట్స్ చేయడంలోనూ వెండి తెరపై తనదైన మార్కు చూపిస్తుంటాడు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో తన టాలెంట్ ప్రదర్శించి మెప్పు పొందుతున్నాడు రామ్. తాజాగా రామ్ థాయ్ బాక్సింగ్ కోచ్ వద్ద తన బాక్సింగ్ స్కిల్స్ ప్రదర్శించి మెప్పు పొందాడట. రామ్ ప్రతిభ చూసి తన టీం కోసం ఫైట్ చేయమని అడిగారట. రామ్ సినిమా హీరో అని తెలియ ఆయన అలా అడిగాట. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ram

వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్‌ బచ్చన్‌'కి రీమేక్‌ ఇది. సినిమా షూటింగులో భాగంగా థాయ్‌లాండ్ వెళ్లిన రామ్ అక్కడ బాక్సింగ్ కోచ్‌తో గడిపారు.

ఇక మొదట ఈ చిత్రానికి 'గరమ్‌ మసాలా' అన్నారు. ఆ తరవాత అది 'గోల్‌ మాల్‌'గా సురేష్ బాబు చెప్పారు. ఈమధ్య 'బ్లాక్‌ బస్టర్‌' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఇద్దరు హీరోలు కాబట్టి 'రామ్‌ బలరామ్‌' అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని కూడా ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ' మసాలా' హీరోలు ఇద్దరికి నచ్చిందని కాబట్టి అదే ఓకే చేసే అవకాశం ఉందని అంటున్నారు. 'నవ్వుకుందాం రాం' అనే మరో టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. త్వరలోనే చిత్ర బృందం ఏదో ఒక టైటిల్ ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇక ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. . బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

English summary
"Muay Thai class in Thailand..Impressed wit my Martial Arts skills,dis coach wanted me 2stay back&Fight for his Team. BTW.. Muay Thai is Thai Boxing.. Tony Jaa?... Ong bak?.. yeah that. .& no he didnt know I was an actor..I was just 1 amongst his students" actor Ram Pothineni tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu