»   » అదిరింది :రామ్‌ ‘హైపర్‌’ ఫస్ట్ లుక్

అదిరింది :రామ్‌ ‘హైపర్‌’ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్‌ హీరోగా సంతోష్‌ శ్రీనవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'హైపర్‌' అనే టైటిల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది. 'ప్రతి ఇంట్లో ఒకడుంటాడు' అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. దాన్ని రామ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు.

దర్శకుడు సంతోష్‌ శ్రీనవా‌స్ మాట్లాడుతూ ''ఇందులో రామ్‌ పాత్ర హైపర్‌గా ఉంటుంది. అతని కేరక్టరైజేషనను, ఎనర్జిటిక్‌ పెర్ఫార్మెన్సను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు 'హైపర్‌' అనే పేరును నిర్ణయించాం. మామూలుగా ప్రతి ఇంట్లోనూ ఒకరైనా చురుగ్గా ఉంటారు. అలా కుటుంబ నేపథ్యంలో సాగే యాక్షన ఎంటర్‌టైనర్‌ ఇది. రామ్‌ కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుంది. ఫస్ట్‌లుక్‌ను ఆగస్ట్‌ 3న విడుదల చేస్తాం. సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు.

Ram's Hyper First Look

నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ.... 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఆగస్ట్‌ 5 నుండి వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ జరుగుతుంది. ఆగస్ట్‌ 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది.'' అన్నారు.

రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
Now Energetic hero Ram is back with his new movie 'Hyper', the title that suits much to his acting and energy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu