»   » 'అలా అనుకుంటే పైకి పోతారు' ...హీరో రామ్..

'అలా అనుకుంటే పైకి పోతారు' ...హీరో రామ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస ఫ్లాపుల్లో ఉన్న రామ్ ఇప్పుడు వేదాంతం మొదలెట్టాడు. ఆయన తన ట్విట్టర్ పేజీలో ఇలా రాసాడు... 'నేను గుడ్ GOOD అనుకుంటే పనికి వస్తావు...నేనే గాడ్ GOD అనుకుంటే పైకి పోతావు...ఆలోచనలలో ఒక్క సున్నానేై తేడా' అన్నారు.

స్క్రిప్ట్ విషయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పే రామ్ గత కొంతకాలంగా స్క్ర్రిప్టుల ఎంపికలో తడబడుతున్నారు. ఈ విషయమై రామ్ మాట్లాడుతూ... నాకు స్క్రిప్ట్ నచ్చితే ఏడాది దాటాక కూడా చిన్న చిన్న విషయాలు చెప్పగలను. నాకు నచ్చకపోతే చిన్న విషయం కూడా చెప్పలేను. ఎవరైనా స్క్రిప్ట్ చెప్తుంటే నాలుగైదు విధాల ద్వారా ఆలోచిస్తాను. కధ చెప్పే వాడు ఆరవ విధంగా చెప్తే నాకు నచ్చుతుంది. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం అన్నారు.

ఇక ప్రయోగాత్మక సినిమాల గురించి చెప్తూ..అందరి దర్శకులకి నన్ను చూస్తే ప్రయోగాలు చెయ్యాలనిపిస్తుంది. ఉదాహరణకు నేను కరుణాకరన్ తో ప్రేమకధను చేయాలనుకున్నా. కానీ అతను నాతొ వేరే విధమైన సినిమా తీసాడు. ఇదివరకే ఇలాంటివి మరొకటి జరిగింది. నేను దర్శకులను ఉత్తేజపరచడం నాకు నచ్చింది. చిన్న బడ్జెట్ సినిమాల విషయానికొస్తే మనకి భారీ నిర్మాణ విలువలతో, భారీ సెట్లనడుమ చూడడం ఇష్టం. తమిళ మరియు మలయాళం వారికి వేరే సంస్కృతి. ఎవరి ఇష్టాలు వాళ్ళకి వుండడం సహజం అన్నారు.

ఫ్లాపులు గురించి మాట్లాడుతూ.. నేను బాధపడనని చెప్పలేను. కాకపోతే తప్పక హిట్ అవుతుందన్న సినిమా ఫ్లాప్ అయితే బాధ వేస్తుంది సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్ నూ దర్శకుడినో నమ్ముతాను లేదా నమ్మిస్తారు. ఒక్కోసారి దర్శకుడు చెప్పిన విషయం నాకు నచ్చకపోయినా అతని మీద నమ్మకంతో ఒప్పుకుంటాను. కానీ ఒకోసారి అవి ఫలించవు. జగడం తరువాత నేను చాలా భాధలో వున్నాను. "ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పుకోకపోతే ఎంత బాధ వస్తుందో అంతా బాధగా". నా కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఎదురుకున్నా. నేను స్టాక్ మార్కెట్ లాంటి వాడిని. ప్రస్తుతం నా తప్పులను తెలుసుకుని నేను ఆనందంగా వున్నాను అని చెప్పుకొచ్చారు.

English summary
Ram tweeted: I'm GOOD anukunte Paikivostaavu..Im GOD anukunte Paikipothaavu..Aalochanalo Okka SUNNAney Thedha.
Please Wait while comments are loading...