»   » రామ్ ‘మసాలా’ఆడియో విడుదల తేదీ ఖరారు

రామ్ ‘మసాలా’ఆడియో విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్‌ బచ్చన్‌'కి రీమేక్‌గా ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి 'మసాలా' అనే టైటిల్ ఖరారు చేసి రీసెంట్ గా ఫ స్ట్ లుక్ ని విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో అక్టోబర్ 13 న విడుదల చేయనున్నారని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన వస్తుంది. ఇక చిత్రం ఈ నెల్లోనే భారీగా విడుదల చేస్తారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన పాటలను విజయ దశమికి విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రామ్ ట్వీట్ లో... కంటెంట్ రెడీ అయ్యాక కంట్రోలు చేసుకోవడం చాలా కష్టం....మా సినిమాని మీ ముందుకు ఎప్పుడెప్పుడు తీసుకువస్తానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను...ఆడియో,సినిమా రిలీజ్ లు ఎప్పుడు అని అడిగుతున్నారు. మేము అంతా రెడీ అయిపోయాము... స్టేట్ లో ఇష్యూలు సెటిల్ అయితే మాకు క్లారిటీ వస్తుంది... అన్నారు. తుఫాన్ పెద్ద గొడవలు లేకుండా విడుదల అవటంతో అందరూ ధైర్యం చేస్తున్నారు.


ఇందులో అంజలి, షాజన్‌పదమ్‌సీ హీరోయిన్స్. అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్ కాంబినేషన్‌లో రూపొంది, హిందీలో ఘనవిజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి ఇది రీమేక్. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, పాటలు: రామజోగయ్యశాస్త్రి.

English summary
The audio release date of Ram’s ‘Masala’ has been confirmed. The album will be released on October 13th in Hyderabad. The film is the official remake of the Bollywood blockbuster ‘Bol Bachchan’. Anjali and Shazahn Padamsee will be seen as the heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu