»   » మీనాక్షిని పడేయాలనే రామ్ తిప్పలు

మీనాక్షిని పడేయాలనే రామ్ తిప్పలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : హీరో రామ్ ప్రస్తుతం మీనాక్షిని పడేయటానికి నానా తిప్పలు పడుతున్నాడు. అందుకోసం ఆమెను ఆకట్టుకోవటం కోసం కాస్త వైవిధ్యంగా.. హెయిర్‌ తగ్గించి మీసకట్టు, గెడ్డం పూర్తిగా తొలగించాడు. అందుకు మ్యాచింగ్‌గా ఉండే రకరకాల కళ్లజోళ్లు పెట్టి ప్రయోగాలు చేశాడు. అయితే అదంతా సినిమాకోసమే. వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'మసాలా' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. త్వరలోనే మసాలా ఆడియో రిలీజ్‌కానుంది.

ఈ చిత్రం పాటల్ని విదేశాల్లో తెరెకక్కించారు. అందులో భాగంగా హీరోయిన్ ని ఉద్దేశించి... మీనాక్షి.. అనే పాటకి రామ్ స్టెప్పులు వేశాడు. ఈ పాటలో ఎనర్జిటిక్‌ డ్యాన్సులతో పాటు కొత్తలుక్‌ కోసం ప్రయత్నించాడు. కాస్త వైవిధ్యంగా.. హెయిర్ తగ్గించి మీసకట్టు, గెడ్డం పూర్తిగా తొలగించాడు. అందుకు మ్యాచింగ్‌గా ఉండే రకరకాల కళ్లజోళ్లు పెట్టి ప్రయోగాలు చేశాడు. ఈ న్యూలుక్‌ నిజంగానే చూపరులకు ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు మీడియాకు అందేలా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్‌ బచ్చన్‌'కి రీమేక్‌ ఇది. గత కొంత కాలంగా ఈ సినిమా కోసం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి ' మసాలా' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు లోగో త్వరలో విడుదలయ్యి ఈ ఊహలకు తెరదించనున్నాయి.

ఇక మొదట ఈ చిత్రానికి 'గరమ్‌ మసాలా' అన్నారు. ఆ తరవాత అది 'గోల్‌ మాల్‌'గా సురేష్ బాబు చెప్పారు. ఈమధ్య 'బ్లాక్‌ బస్టర్‌' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఇద్దరు హీరోలు కాబట్టి 'రామ్‌ బలరామ్‌' అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని కూడా ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ' మసాలా' హీరోలు ఇద్దరికి నచ్చిందని కాబట్టి అదే ఓకే చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం ఈ టైటిల్ ఖరారు చేసి ప్రకటన చేసే అవకాసం ఉంది.

ఇక ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. . బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక రామ్ అంటే ఎనర్జీ. డ్యాన్సులు, ఫైట్స్‌లో ఇరగదీస్తాడు. కురహ్రీరోల్లో తనకంటూ ఓ ఇమేజ్‌ ఉంది. ఇప్పుడిలా మీనాక్షి కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఒంగోలు గిత్త ప్లాపైనా గిత్త స్పీడు తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం అని నిర్మాతలు అంటున్నారు. రామ్ ఈసారి హిట్‌ కొట్టడం ఖాయం అని చెప్తున్నారు. త్వరలోనే ఆడియో, టీజర్‌ విడుదల చేస్తారు.

English summary
Ram dance and song for Masala film. In this film heroine Shazahn Padamseei is Meenakshi. Several titles were considered for Venky and Ram starrer film. It is said that now the makers have finally opted for Masala. Masala is a remake of Bollywood film Bol Bachchan, which starred Ajay Devgan and Abhishek Bachchan. Venkatesh is paired with Anjali and Ram is paired with Shazahn Padamsee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu