»   » కామెడీ దినుసలతో...( 'మసాలా' ప్రివ్యూ)

కామెడీ దినుసలతో...( 'మసాలా' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్, వెంకటేష్ హీరోలుగా విజయభాస్కర్‌.కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మసాలా'. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది. హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా రూపొందుతోంది. పూర్తి స్ధాయి కామెడీగా రూపొందిన ఈ చిత్రంపై దర్శక,నిర్మాతలు చాలా నమ్మకం పెట్టుకున్నారు.


చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఇంగ్లిష్‌లో మాట్లాడాలనే తపన ప్రదర్శించే ఓ పెద్దమనిషి... ప్రేమ కబుర్లు చెప్పి అల్లరి చేసే ఓ కుర్రాడు... వీరిద్దరి మధ్య సాగే ఓ సరదా కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే. కథని నమ్మి ఈ సినిమాను చేశాం. 'మసాలా' నిజంగా ఒక రుచికరమైన సినిమా అవుతుంది. చాలా వేగంగా చిత్రాన్ని పూర్తి చేశాం. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొంటారు అన్నారు.

రామ్ మాట్లాడుతూ "టైటిల్‌కు తగ్గట్లే ఇది ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన మంచి మసాలా చిత్రం. ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రంలో చక్కని ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. వెంకటేశ్, రామ్ పాత్రలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. తమన్ సంగీతం సమకూర్చగా ఇటీవల విడుదల చేసిన పాటలకు చాలా చక్కని స్పందన లభించింది. చిత్రీకరణ పరంగానూ అవి బాగా ఆకట్టుకుంటాయి. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్లు మాస్ ప్రేక్షకులతో పాటు ఆబాల గోపాలాన్ని అలరించడం ఇందులోని ప్రత్యేకత. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

'మసాలా' లో రెండో రకం పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా తర్ఫీదు పొందటంలాంటిదేమీ లేదు . అయితే ఆ పాత్ర విషయంలో శివశంకర్‌ మాస్టర్‌ నాకు బాగా సహకరించారు. సినిమాలో ఆ పాత్రపై ఓ పాట ఉంటుంది. దాంతోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. శివశంకర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చడంతో నా పని సులువైంది. సినిమా మొత్తం ఆయన్ని అనుకరిస్తూ నటించా. రెండు కోణాల్లో సాగే పాత్ర అది. రెండో రకం పాత్ర కాస్త తేడాగా ఉంటుంది. దీంతో ఈ సినిమా చేద్దామా వద్దా? అని రెండు రోజులు ఆలోచించాను. ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించొచ్చనే అభిప్రాయంతో చివరికి సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. ఈ పాత్రని హిందీలో అభిషేక్‌బచ్చన్‌ పోషించారు. సినిమా పూర్తయ్యాక తెరపై నన్ను నేను చూసుకొన్నప్పుడు నటుడిగా ఎంతో సంతృప్తిచెందా. ఈ సినిమా చేయకపోతే ఒక విభిన్నమైన పాత్రని కోల్పోయేవాడిననిపించింది.


వెంకటేష్ మాట్లాడుతూ... ''మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వినోదం, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యమున్న సినిమాలు ఇటీవల చక్కటి ఫలితాల్ని సాధిస్తున్నాయి. మా చిత్రం కూడా అదే తరహాలో ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉండబోతోంది. 'విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' చిత్రాల్లో నటించాను. ఇప్పుడు మూడోసారి ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. రామ్‌ కీలకమైన పాత్రలో నటించాడు. తన సినీ జీవితంలో ఇదొక మంచి పాత్ర అవుతుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. తమన్‌ చక్కటి బాణీల్ని సమకూర్చాడు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు .


నిర్మాతలు మాట్లాడుతూ ''సరికొత్త రుచులను పంచే మసాలా ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. వెంకటేష్‌, రామ్‌లు కలిసి చేసే సందడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందనవస్తోంది''అన్నారు.

నటీనటులు:రామ్, వెంకటేష్, షాజన్‌పదంసి, అంజిలి, అలీ, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్‌.ఎస్‌.నారాయణ,పోసాని కృష్ణ మురళి, జె.పి, భరత్, కాదంబరి కిరణ్, రామ్‌జగన్, అనంత్, గీతాంజలి, కోవై సరళ, శ్రీలక్ష్మి తదితరులు
కథ: రోహిత్‌శెట్టి,
ఛాయాగ్రహణం: ఆండ్రూ,
కళ: ఏ.ఎస్.ప్రకాష్,
సంగీతం: తమన్‌
ఎడిటింగ్: ఎస్.ఆర్.వర్మ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ చైతన్య,
సమర్పణ: డి.సురేష్‌బాబు,
నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కె.విజయభాస్కర్.

English summary
Latest Telugu multistatter Masala featuring Venkatesh and Ram is all set to release on 14 November. This family entertainer has obtained a clean U certificate from the censor board. This film is an official remake of Rohit Shetty's 100 crore Hindi film Bol Bachchan which was loosely based on Hrishikesh Mukherjee's classic Golmaal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu