For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ కొత్త చిత్రం 'నేను- శైలజ' స్టోరీ లైన్

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నేను శైలజ. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ఆడియోను, జనవరి 1న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

  ఈ చిత్రం కథేమిటంటే... అందం, అణకువ కలబోసిన పుత్తడి బొమ్మ శైలజ. స్వతహాగా తెలివైన అమ్మాయి అయిన ఆమెకు తాను పెళ్లాడబోయే వ్యక్తి విషయంలో కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. ఆమెకు అనుకోకుండా ఓ యువకుడితో పరిచయమేర్పడుతుంది. తన మనసును గెలుచుకోవడానికి శైలజ అతనికి కొన్ని పరీక్షలు పెడుతుంది. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? శైలజ ప్రేమపరీక్షలో ఆ యువకుడు గెలుపు సాధించాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ.... ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. చిత్ర కథ వైజాగ్‌లో మొదలై అక్కడే ముగుస్తుంది. ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. కిషోర్ కథ చెప్పగానే రామ్‌కు కొత్త తరహా సినిమా అవుతుందన్న నమ్మకంతో ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాం. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ కాబట్టి నేను...శైలజ టైటిల్ అయితే బాగుంటుందని ఈ పేరును ఖరారు చేశాం అన్నారు.

  రామ్ మాట్లాడుతూ.... ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించాను. తొలుత ఈ చిత్రానికి హరికథ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ సినిమా చూసిన తరువాత దీనికి నేను...శైలజ కరెక్ట్ అని భావించాం. 55 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. నైట్ క్లబ్‌లో పనిచేసే డీజేగా నటించాను. సాఫ్ట్‌గా కనిపించే పాత్ర అయినా మాస్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో సినిమా వుంటుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను తీసుకుని కథగా మలిచాను. సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా రియలిస్టిక్‌గా వుంటుంది అన్నారు.

  Ram's Nenu-Sailaja Movie concept

  సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్‌కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణచైతన్య, ప్రదీప్‌రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్, డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్క్ష్రిత్, రఘు, ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.

  English summary
  Ram is currently busy promoting his upcoming film Nenu Sailaja under Kishore Tirumala's direction. Latest update reveals that the audio of the film will be launched on the 21st of December in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X