»   » రామ్ 'శివమ్‌' ఆడియో రిలీజ్‌ టీజర్‌ (వీడియో)

రామ్ 'శివమ్‌' ఆడియో రిలీజ్‌ టీజర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'శివమ్‌'. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ టీజర్‌ను విడుదల చేసారు హీరో రామ్‌ . శ్రీనివాస్‌రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవి కిషోర్‌ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 12న విడుదల చేయన్నుట్లు టీజర్‌లో పేర్కొన్నారు. ఈ టీజర్ ని మీరు ఇక్కడ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రామ్ మాట్లాడుతూ - ''టీజర్ కి మంచి స్పందన లభిస్తోంది. ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరి. నాది చాలా మంచి పాత్ర. ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు'' అని చెప్పారు.


Ram’s Shivam audio release teaser

స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - "కథాబలం ఉన్న చిత్రం ఇది. స్ర్కీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ నెల 12న పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. '' అని చెప్పారు.


''ప్రేమకథకి వినోదం, యాక్షన్‌ మేళవించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దర్శకుడు చిత్రాన్ని బాగా తెరకెక్కిస్తున్నారు''అని నిర్మాత చెప్పారు.


Ram’s Shivam audio release teaser

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వినాయక చవితి సందర్భంగా చిత్రాన్ని సెప్టెంబరు 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


బ్రహ్మానందం, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌

English summary
Ram is gearing up to start promotional campaign for his upcoming release, Shivam. A short audio release teaser will be launched to kick start promotion of the film. Audio release function of Shivam will be held on Septemer 12th in Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu