»   »  రామ్ 'శివమ్‌' : ఫస్ట్ లుక్ విత్ రాశిఖన్నా (ఫొటోలు)

రామ్ 'శివమ్‌' : ఫస్ట్ లుక్ విత్ రాశిఖన్నా (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'శివమ్‌'. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. టాకీ భాగం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 17 నుంచి నార్వే, స్వీడన్‌లో పాటల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఫొటోలను విడుదల చేసారు రామ్ తన ట్విట్టర్ ద్వారా. మీరూ ఆ ఫొటోలను చూడండి.

నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ''హుషారైన ఓ కుర్రాడి ప్రేమకథ ఇది. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌ మేళవింపుతో తెరకెక్కుతోంది. రామ్‌ తన శైలికి తగ్గ పాత్రని పోషిస్తున్నాడు''అన్నారు.

Ram's Shivam movie first look

అలాగే - "కథాబలం ఉన్న చిత్రం ఇది. స్క్రీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి'' అని చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బ్రహ్మానందం, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పోసాని తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌

English summary
Ram's Sivam movie first Look released. Directed by debutant Srinivas Reddy and produced by Sravanthi Ravi Kishore, the action entertainer has Raashi Khanna as the leading lady. Devi Sri Prasad is providing the tunes for the film.
Please Wait while comments are loading...