»   » ధాయ్ ల్యాండ్ లో హీరోయిన్ తో రామ్ రొమాన్స్

ధాయ్ ల్యాండ్ లో హీరోయిన్ తో రామ్ రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ ప్రస్తుతం ధాయ్ ల్యాండ్ కు ప్రయాణం కట్టారు. హీరోయిన్ ...షాజన్ పదాంసీతో కలిసి అక్కడ డ్యూయిట్ ప్లాన్ చేసారు. జూలై 29 న అక్కడ షూటింగ్ ప్రారంభమవుతోంది. హిందీలో విజయవంతమైన 'బోల్‌బచ్చన్‌' ఆధారంగా వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తారు. డి.సురేష్‌బాబు, 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి 'రామ్-బలరామ్ ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

మొదట ఈ చిత్రానికి 'గరమ్‌ మసాలా' అనుకొన్నారు. ఆ తరవాత అది 'గోల్‌ మాల్‌'గా మారింది. ఈమధ్య 'బ్లాక్‌ బస్టర్‌' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు 'రామ్‌ బలరామ్‌' అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఖచ్చితమైన టైటిల్ ని ఖరారు చేయలేదు. త్వరలోనే చిత్రబృందం ఓ పేరు ఖరారు చేయనుంది. చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 Ram and Shazahn

బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

English summary
The shooting of Victory Venkatesh, Energetic hero Ram's multi-starrer film which was tentatively titled as “Ram Balram” under Vijaya Bhaskar's direction is progressing at brisk pace. The film is a re-make of Hindi film "Bol Bachchan".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu