Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RED Pre Release Event.. కామెంట్ చూసి ఫోన్‌ను పగలగొట్టేశా.. రామ్ కామెంట్స్
ఉస్తాద్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తోన్న RED మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (జనవరి 12) జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు, రామ్ ఎమోషనల్ అయిన తీరు మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రామ్ తన స్పీచ్‌లో భాగంగా చెప్పిన కొన్ని సంఘటనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

రైటర్స్ అంటే ఇష్టం..
చిన్నప్పుడు పెదనాన్న గారు వచ్చి నువ్ నాకు నచ్చావ్ సినిమా సీన్స్, డైలాగ్స్ చెప్పాడు.. అప్పుడే సినిమా చూసేయాలన్నా కోరిక పుట్టింది.. అప్పుడే రైటర్స్ అన్నా, వారి ప్రభావం, పెన్ను పవర్ నాకు అర్థమైంది. అప్పటి నుంచేనాకు రైటర్స్ అంటే గౌరవం.. అది కూడా త్రివిక్రమ్ వల్లే అంటూ రామ్ చెప్పుకొచ్చాడు.

మాస్ సినిమా కూడా..
అందరూ ఈ సినిమాకు కిషోర్ తిరుమలను ఎందుకు తీసుకున్నారని అందరూ అడిగారు. కానీ నాకు కిషోర్ గురించి అంతా తెలుసు. ఆయనకు తెలియని విషయాలెన్నో నాకు తెలుసు.. ఆయన ఎలాంటి పాత్రలు అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా చూపించగలడు.. మాస్ సినిమా కూడా తీయగలరు.. అంటూ దర్శకుడి గురించి రామ్ చెప్పుకొచ్చాడు.

ఆయనే హీరో..
RED సినిమాకు మా పెదనాన్నే హీరో. ఈ లాక్డౌన్ మొత్తంలో ఆయన నాకు భజరంగీ భాయీజాన్ సినిమాలో పాపను చేతిని పట్టుకున్న సల్మాన్ ఖాన్‌లా కనిపించాడు. ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేస్తామని పట్టుబట్టారు.. అందుకే ఇప్పుడు ఇలా ఇక్కడి వరకు వచ్చింది.. లేదంటే సినిమా ఎప్పుడో ఓటీటీల్లో వచ్చేది.. అందుకే ఈ సినిమాకు ఆయనే హీరో అంటూ రామ్ చెప్పుకొచ్చాడు.

నా ఎనర్జీ మీరే..
నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని అందరూ అడుగుతుంటారు.. మీరు చేసే అల్లరి, వేసే ఈలలు కేకల్లోంచే నాకు ఎనర్జీ వస్తుంది.. మీరే నా ఎనర్జీ.. హలో గురు ప్రేమ కోసమే సినిమా టైంలో నాకు 104 డిగ్రీల జ్వరం వచ్చింది.. షూటింగ్ వద్దని అందరూ అంటున్నారంటూ నాటి సంఘనను గుర్తు చేసుకున్నాడు రామ్.

ఫోన్ పగలగొట్టాను..
కానీ నేను మాత్రం చేద్దామని సాంగ్ షూట్ కోసం రిహార్సల్స్ చేస్తున్నాను.. కానీ చేయలేకపోతున్నాను.. అలా కాసేపు పక్కన కూర్చొని ట్విట్టర్ ఓపెన్ చేశాను.. అందులో ఒకరు.. అన్నా డ్యాన్స్‌లు మాత్రం చించేయాలని అని పెట్టాడు. ఆ కామెంట్ చూసి ఫోన్ విసిరి పగలగొట్టేసి ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసేశాను అంటూ రామ్ చెప్పుకొచ్చాడు.