»   » రామ్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ ప్రారంభం

రామ్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్, జెనీలియా జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న పేరుపెట్టని చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి సన్నివేశానికి డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్‌ నివ్వగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎం శ్యాంప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ..అతిధి పూర్తయిన తర్వాత నేను సురేంద్రరెడ్డితో చేయాల్సింది. కానీ కాలేదు. అతని స్టైలిష్ టేకింగ్, టెక్నికల్ విలువలు నాకు నచ్చుతాయి. అతనిది అప్ టు డేట్ టెక్నాలిజీ. అలాగే నాకు రవికిషోర్ లాంటి పెదనాన్న దొరకటం నా అదృష్టం అన్నారు. ఇక దర్శకుడు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ...నాకు రామ్ లో ఉండే ఎనర్జీ అంటే చాలా ఇష్టం. నన్ను నేను రామ్ తో పోల్చుకుంటూ చూసుకుంటూంటాను. అలాగే నేను చక్రి, పీటర్ హెయిన్స్ తో చేయటం తొలిసారి. ఇక నా ఈ ఐదవ చిత్రం నా బెస్ట్ మూవి అవుతుందని హామీ ఇస్తున్నాను అన్నారు. నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ...ఇది రామ్ తో మూడవ చిత్రం...అలాగే ఎక్కువ బడ్జెట్ పెడుతున్న చిత్రం కూడా అన్నారు.

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో రామ్ క్యారెక్టర్ సరిగ్గా సురేంద్రరెడ్డి పర్శనల్ లైఫ్ ని పోలి ఉంటుంది. మొన్నే చూసాం సురేంద్రరెడ్డి పైరసీపై పోరాటానికి ఎలా నడుం బిగించారో...అలాగే ఇందులో రామ్ పాత్ర కూడా నడుస్తుంది అన్నారు. ఇక రామ్, స్రవంతి రవికిషోర్ లతో ఇంతకు ముందు రెడీ చిత్రానికి పనిచేసాను..మళ్ళీ ఇప్పుడు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. కథా రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ...కిక్ సినిమా రిలీజై పది నెలలు అయింది. అప్పటి నుంచీ ఇదే కథ మీద ఉన్నాం. ఈ చిత్రంలో కొత్త రామ్ ని చూస్తారు. మంచి చిత్రం అవుతుందని నాకు నమ్మకం ఉంది అన్నారు. సంగీత దర్శకుడు చక్రి రామ్, నా కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో చిత్రం మంచి మ్యూజికల్ హిట్ అవటానికి కృషి చేస్తాను అన్నారు. ఇక రామ్ సోదరుడు కృష్ణ చైతన్య సమర్ఫిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే ఒకటవ తేది నుంచి ప్రారంభం అవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu