»   » ఆ కుర్ర హీరో కూడా తమన్నానే కావాలని పట్టుబట్టి..

ఆ కుర్ర హీరో కూడా తమన్నానే కావాలని పట్టుబట్టి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'100% లవ్‌' సూపర్ హిట్ తో యూత్ లో తమన్నా కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో ఆమె తమ ప్రక్కన నటిస్తే తమకూ ఓ రేంజి క్రేజ్ వస్తుందని హీరోలు భావిస్తున్నారు. రీసెంట్ గా రామ్ కూడా తన ప్రక్కన తమన్నా అయితే వెంటనే డేట్స్ ఇస్తానని లోపాయికారిగా ప్రకటించి ఆమెను సొంతం చేసుకున్నాడు. తొలిప్రేమ దర్శకుడు కరుణాకణన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. వచ్చే నెల నుండి షూటింగ్ మొదలవ్వనుంది.జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మంచి బడ్జెట్ తోనే రూపొందుతోంది. ప్రస్తుతం రామ్ 'కందిరీగ' షూటింగ్ లో ఉన్నారు. కరుణాకరన్‌ సినిమాతోపాటు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలోనూ నటించేందుకు రామ్ రెడీ అవుతున్నాడు.ఇక 'డార్లింగ్‌' తర్వాత కరుణాకరన్ డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే.

English summary
Tamanna is flying high in Tollywood these days. The actress already had three films in her kitty and now, she bagged another big project in the direction of Karunakaran. Tamanna is currently acting in Badrinath opposite Allu Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu